ఖైదీ పవన్ చేస్తే బాగుండేదట..!

241
Is Khaidi for Pawan Kalyan
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్‌ 150 మూవీ అందరి అంచనాలను బీట్ చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత తెరపై కనిపించనున్న చిరంజీవిని తెరమీద చూడడానికే చాలా మంది సినిమా వెళ్లారు. పక్కా మాస్ సినిమాగా ఖైదీ తెరకెక్కినప్పటికీ,అంతర్లీనంగా మేసేజ్ కూడా ఇచ్చాడు చిరంజీవి. నిజానికి ఈ కథ తమిళంలో తెరకెక్కముందే.. చిరంజీవి చెయ్యాల్సింది.

స్టాలిన్ మూవీ టైంలోనే మురుగదాస్ ఈ కథ చిరూకి చెప్పాడట. అయితే అప్పుడు చిరు దీనిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో మరుగదాస్ విజయ్ హీరోగా అదే కథతో కత్తి మూవీ తీసి బంపర్ హిట్ కొట్టాడు. రీఎంట్రీ కోసం చూస్తున్న చిరంజీవి మళ్లీ అదే కథతో ఖైదీనంబర్ 150 గా థియేటర్లలోకి రావడం కాకతాలీయమే. ఇక తమిళంలో కత్తి సినిమా విడుదలైనపుడు చాలామంది తెలుగు హీరోలు ఈ కథపై ఆసక్తి చూపించారు.

చిరంజీవితోపాటు ఎన్టీయార్‌, పవన్‌కల్యాణ్‌ లాంటి స్టార్‌ హీరోలు సైతం ఈ సినిమా రీమేక్‌ చేయాలనుకున్నారు. ఫైనల్ గా చిరంజీవి ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. అయితే ప్రస్తుతం కొందరు ఈ సినిమా పవన్ చెయ్యాల్సిందని అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించడంతో పాటు, పలు రకాల సమస్యలపై ఫోకస్‌ పెడుతున్న పవన్‌ కల్యాణ్‌ మైలేజ్ పెరిగి ఉండేదని వారి వాదన. ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న వారిలో ఓ ప్రముఖ దర్శకుడు, పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. ఇలాంటి సినిమాలు చెయ్యడం ద్వారా జనసేనకు చాలా లాభించేందని వారు చెబుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -