కర్నాటకలో కాంగ్రెస్ ఢమాల్..హింట్ ఇచ్చిన బీజేపీ!

35
- Advertisement -

కర్నాటకలో గత బీజేపీ ప్రబుత్వానికి షాక్ ఇస్తూ మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని అందుకొని అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. 224 సీట్లకు గాను 135 సీట్లు సొంతం చేసుకొని కనీవినీ ఎరుగని విజయాన్ని హస్తం పార్టీ సొంతం చేసుకుంది. అయితే ఇంతా భారీ విజయాన్ని కాంగ్రెస్ అందుకున్నప్పటికి.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని నిలుపుకోవడంలో భయపడుతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తమ ప్రభుత్వాన్ని కుల్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్పడం గమనించాల్సిన విషయం..

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ ఆ మద్య మాట్లాడుతూ మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు సింగపూర్ లో ప్రణాళికలు జరుగుతున్నాయని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కత్తిమీద సాములా మారిందని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి కాంగ్రెస్ సర్కార్ కు ముప్పు పొంచి ఉందనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది. ఇక తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బసవగౌడ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సిద్దిరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలకు ముందే కుప్పకూలుతుందని, ఆ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బాంగ్ పేల్చారు. దీంతో కర్నాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ తొమ్మిదేళ్లలో దాదాపు తొమ్మిది రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చి అక్రమంగా అధికారాన్ని చేపట్టాయి. ఇప్పుడు కర్నాటకలో కూడా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ అస్త్రశాస్త్రాలు రచిస్తోంది. ఎందుకంటే సౌత్ రాష్ట్రాలలో అంతో ఇంతో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం కర్నాటక మాత్రమే. అందుకే ఈ రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావలనేది బీజేపీ ప్లాన్.. ఇప్పటికే కాంగ్రెస్ లోని కొంతమంది ఎమ్మెల్యేలతో బీజేపీ అధిష్టానం మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ముందు రోజుల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలి.

Also Read:మీ చూపంతా ఫోన్ పైనేనా..? జర జాగ్రత్త

- Advertisement -