బిగ్ బాస్‌ 4..సూర్యకిరణ్ తర్వాత ఆమెనే!

357
karate kalyani

బిగ్ బాస్ సీజన్ 4 రెండో వారంలో 9 మంది ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. తొలివారంలో సూర్య కిరణ్ ఎలిమినేట్ కాగా రెండో వారంలో ఎలిమినేట్ అయ్యేదెవరు అనేదానిపై సస్పెన్స్ నెలకొంది.

అయితే ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారిలో గంగవ్వ, నోయల్, కరాటే కళ్యాణి, మొనాల్ గజ్జర్, సొహైల్, అమ్మా రాజశేఖర్ కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్‌‌లు ఉన్నారు.వీరిలో ఇప్పటికే ఓటింగ్‌లో అభిజిత్,గంగవ్వలు టాప్ పొజిషిన్‌లో ఉండగా లీస్ట్‌లో అమ్మ రాజశేఖర్,కరాటే కల్యాణి ఉన్నారు.
ఓటింగ్ పరంగా చూసిన హౌస్‌లో ఎంటర్‌టైన్మెంట్ పరంగా చూసిన లీస్ట్‌లో ఉన్న కరాటే కల్యాణి ఈ సారి హౌస్‌ నుండి ఎలిమినేట్ కావడం ఖాయమని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

హౌస్‌లోకి వచ్చిన తొలి రోజు నుంచి అందర్నీ కమాండ్ చేయడం.. ఎవర్నీ మాట్లాడనీయకుండా తాను చెప్పిందే వేదం అన్నట్టుగా మాట్లాడటం అందరికి నచ్చట్లేదు. నాగార్జున సైతం ఇంకేవరిని మాట్లాడడనియ్యవా అంటూ క్లాస్ కూడా పీకారు. వీటన్నింటిని గుర్తుచేస్తున్న నెటిజన్లు కరాటే కల్యాణి ఎలిమినేట్ కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే వీకెండ్ వరకు వేచిచూడాల్సిందే.