విశాఖ నుంచి జగన్ పాలన కష్టమేనా?

36
- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో విశాఖ నుంచి పాలన సాగిస్తారని, మూడు రాజధానుల అమలు ఎట్టి పరిస్థితిలో జరుగుతుందని వైసీపీ నేతలు గత కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్నారు. కానీ వ్యాఖ్యలు కేవలం ఒట్టిమాటలుగానే మిగిలిపోతున్నాయి తప్పా ఆచరణలోకి రావడం లేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో పరిపాలన వికేంద్రీకరణ జరగాలని అందుకోసం మూడు రాజధానులు ప్రవేశపెట్టబోతున్నామని ప్రకటించారు. కానీ త్రీ క్యాపిటల్స్ విషయంలో ఎదురవుతున్న అడ్డంకులు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా అమరావతి రైతుల కారణంగా కోర్టు నుంచి మూడు రాజధానులకు బ్రేక్ పడింది.

దాంతో చేసేదేమీ లేక మూడు రాజధానుల ప్రస్తావనను కొంత హోల్డ్ లో ఉంచి విశాఖను మాత్రమే రాజధానిగా మార్చేందుకు ప్రయత్నించింది జగన్ సర్కార్. ఎట్టి పరిస్థితిలో రాజధాని విశాఖకు షిఫ్ట్ అవుతుందని సి‌ఎం విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తారని వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు. జగన్ కూడా తాను సెప్టెంబర్ లో విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించారు కూడా. దీంతో విశాఖ రాజధాని ఖాయమేనా అనే భావన కలిగించి చాలమందిలో. కాని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జగన్ విశాఖకు షిఫ్ట్ కావడం అక్కడి నుంచి పాలన సాగించడం అంతా తేలికైన విషయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:ఇదేనా బీజేపీ సమన్యాయం?

మూడు రాజధానుల అంశం ఇంకా కోర్టులో పెండింగ్ లోనే ఉండగా, ఇటు క్యాంపు ఆఫీస్ పనులు కూడా ఏమంత జోరుగా సాగడం లేదు. క్యాంపు కార్యాలమ పనులు పూర్తి కావడానికి మరో 2 నెలలు సమయం పట్టిన ఆశ్చర్యం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈలోగా ఎన్నికలు మరింత దగ్గర పడడంతో అప్పటికప్పుడు విశాఖ నుంచి పాలన సాగిస్తే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడే అవకాశం కూడా ఉంది. అందుకే విశాఖ నుంచి జగన్ పాలన ఇప్పట్లో కష్టమే అని తెలుస్తోంది. మరి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నాడో చూడాలి.

Also Read:బండి సంజయ్ రాజీనామాకు సిద్దమా?

- Advertisement -