ఆపరేషన్ రావణ్..సాంగ్ రిలీజ్

30
- Advertisement -

రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి చందమామ కథలోన అనే లిరికల్ పాటను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు విడుదల చేశారు. టీమ్ కు తన ఆశిస్సులు అందజేశారు

శరవణ వాసుదేవన్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ రాయగా..హరి చరణ్, గీతామాధురి పాడారు. చందమామ కథలోన, అందమైన పిల్లేనా, కళ్లముందు కదిలిందా, తుళ్లి తుళ్లి పడ్డానా..అంటూ ప్రేయసి అందాన్ని పొగుడుతూ సాగుతుందీ పాట.

ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇతర కీలక పాత్రల్లో నటించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆపరేషన్ రావణ్” సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.నటీనటులు: రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు

Also Read:ఎన్డీయేకు మిత్రపక్షాల షాక్!

- Advertisement -