Jagan:జగన్ హామీలన్ని నెరవేర్చారా?

37
- Advertisement -

ఎన్నికల ముందు టీడీపీ వైసీపీ మద్య విమర్శల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలన్నిటిలో 99 శాతం నెరవేర్చామని వైసీపీ చెబుతుంటే.. కాదు కాదు 99 శాతం హామీలను ఎగ్గొట్టారని టీడీపీ చెబుతోంది. దీంతో గత ఎన్నికల ముందు ప్రకటించిన హామీలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో 9 ప్రధాన హామీలను బాగా హైలెట్ చేస్తూ జగన్ ఎన్నికలకు వెళ్ళిన సంగతి తెలిసిందే. వైసీపీ భారీ విజయం సాధించడంలో నవరత్నాలే కీలక పాత్ర పోషించాయి. అమ్మఒడి, సంపూర్ణ మద్యపాన నిషేధం, రైతు భరోసా, రైతులకు ఉచిత బోర్లు, చేయూత, ఆసరా, ఆరోగ్య శ్రీ పెంపు ఇలా చాలానే హామీలు ప్రకటించారు. అయితే ఎన్నికల ముందు ప్రకటించిన హామీలను దాదాపు అన్ని నెరవేర్చమని వైసీపీ చెబుతోంది.

అయితే జగన్ పెండింగ్ లో ఉంచిన హామీల సంగతేంటి అని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేదం, సిపిఎస్ రద్దు, సన్న బియ్యం, ప్రతి ఏడాది జనవరి 1 న జాబ్ క్యాలెంటర్, 45 ఏళ్ళు దాటితే పెన్షన్.. ఇలా చాలా పథకాలనే జగన్ ఆదమరిచారని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. ఇచ్చిన హామీలన్నిటిని పూర్తి చేసిన తరువాతనే ఎన్నికల ప్రచారానికి వెళ్తానని చెప్పిన జగన్.. ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి సిద్దమయ్యారని టీడీపీ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో ప్రశ్నించారు.

ఇంకా ఈ హామీలు మాత్రమే కాకుండా తాము అధికారంలోకి వస్తే కేంద్రం మేడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు కేంద్రానికి బానిసలా మారారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకా 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన జగన్.. ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ ఊసే ఎత్తడం లేదని మండి పడుతున్నారు. ఇలా చాలా హామీలను జగన్ అట్టకెక్కించారని టీడీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఇచ్చిన హామీలలో 99 శాతం నెరవేర్చమని చెబుతోంది. మరి ఎవరి వాదన నిజమనేది ప్రజలే గమనించాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:BJP: 9 మందితో బీజేపీ మూడో జాబితా

- Advertisement -