ఎండల తీవ్రత రోజురోజుకూ రెట్టింపు అవుతోంది. ఉదయం 10 గంటల నుంచే సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటుతుండడంతో అసలు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇక మద్యాహ్నం అయితే నిప్పుల కొలిమిలో ఉన్నట్లుగా ఎండలు మండిపోతున్నాయి. దాంతో ఈ వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు శీతల పానియాల వైపు మన దృష్టి ఆటోమాటిక్ గా మల్లుతుంది. వేడి వేడి ఎండలో చల్ల చల్లగా కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, లస్సీ వంటివి సేవిస్తుంటారు చాలామంది. వీటితో పాటు వేసవిలో ఎక్కువ మంది సేవించే పానీయాలలో మజ్జిగ కూడా ఒకటి. మజ్జిగ ను ఇంట్లో కూడా తయారు చేసుకొని తాగుతూ వేసవి తాపం నుంచి సేద తీరుతుంటారు..
అయితే వేసవిలో మజ్జిగ తాగడం మంచిదేనా అంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగలో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటివి కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వేడిని తగ్గించి బాడీ ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తాయి. అందువల్ల వేసవిలో రోజుకు మూడు సార్లు ఒక్కో గ్లాస్ చొప్పున మజ్జిగ తప్పని సరిగా తాగాలని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ లో దొరికే రసాయనిక శీతల పానియాల కన్నా సహజసిద్దంగా తయారు చేసుకొనే మజ్జిగ వేసవిలో ఎంతో మేలు చేస్తుందని పలు ఆధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
Also Read: వేసవిలో ఇలా చేస్తేనే ఆరోగ్యం!
ఇంకా వివిధ రకాల ఉదర సమస్యలను కూడా మజ్జిగ దూరం చేస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేయడంతో పాటు గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. అయితే మజ్జిగ ను ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకొని సేవించడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మజ్జిగ పై పోరలో బ్యాక్టీరియా పెరిగి పైత్యాన్ని కలుగజేస్తుందట. కాబట్టి తాజా మజ్జిగ మాత్రమే తాగాలని చెబుతున్నారు నిపుణులు. మొత్తానికి వేసవిలో రసాయనిక శీతల పానీయాల కంటే మజ్జిగ తాగడమే ఎంతో ఉత్తమం.
Also Read: పెసరట్టు – ఉప్మా…చరిత్ర