ఖర్జూరాలు తింటే ఎన్ని ఉపయోగాలో!

90
- Advertisement -

ఖర్జూరపండు గురించి మనందరికి తెలిసే ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ లో ఒకటిగా చెప్పుకునే ఖర్జూరను ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఖర్జూర తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే దానిపై మాత్రం చాలా మందికి అవగాహన ఉండదు. అయితే ఖర్జూర పండు తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే.. దీనిని తినకుండా అసలు ఉండలేరు. మరి ఖర్జూర తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందామా..!

ఖర్జూర అనేది ఎన్నో పోషకాల నిలయం. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి వాటితో పాటు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ శరీరంలోని ఎముకలను దృఢ పరచడంతో పాటు కండర పుష్టిని అందిస్తాయి. ఖర్జూరలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమెంటరీ గుణాలు.. క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులను నిరోదించడంలో ఉపయోగ పడతాయి. ఖర్జూరలలో వివిధ రకాల విటమిన్స్ తో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థలోని సమస్యలను తొలగించి జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది. తద్వారా మలబద్దకం, ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం పుట ఖాళీ కడుపుతో రెండు నుంచి మూడు ఖర్జూరాలు తింటే ఎన్నో లాభాలు పొందవచ్చట. ఉదయం పూట వీటిని తినడం వల్ల శరీరానికి ఇన్‌స్టంట్ శక్తి లభిస్తుంది.

తద్వారా రోజంతా ఉల్లాసంగా ఉండడానికి దోహదం చేస్తుంది. ఖర్జూరలలోని యాంటీ ఆక్సిడెంట్లు ప్రేగులలోని పరాన్న జీవులను నాశనం చేయడంతో పాటు గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అంతే కాకుండా కాలేయన్ని శుభ్రం చేయడంలో కూడా ఖర్జూర పండు ఎంతగానో ఉపయోగ పడుతుందట. ప్రతిరోజూ 2- 4 ఖర్జూరాలు తినడం వల్ల రోగనిరోదక శక్తి పెరగడంతో పాటు హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను దూరం అవుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో కూడా ఖర్జూరా ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్లు పురుషులలో స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయని పలు అధ్యయనల్లో రుజువైంది కూడా. కాబట్టి ఎన్నో ఉపయోగాలు ఉన్న ఖర్జూరాలను ప్రతిరోజూ తినాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read: ఆ సినిమాతో వచ్చాయ్…ఈ సినిమాతో పోయాయ్

- Advertisement -