షాక్ ఇచ్చిన ఇలియానా..ఇతనెవ్వరు?

38
- Advertisement -

గోవా ముదురు భామ ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది. పైగా, తన బేబీ బంప్ తో కనిపిస్తూ ఇలియానా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతోంది. బేబీ బంప్ ఫొటోలను స్వేచ్ఛగా ప్రేక్షక లోకానికి పరిచయం చేసింది. ఇంతకీ, ఇలియానా కడుపుకి కారణం ఎవరై ఉంటారు ? అంటూ మరోవైపు నెటిజన్లు తెగ చర్చలు పెడుతున్నారు. అయితే, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రీనా కైఫ్‌ సోదరుడు ‘సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌’తో ఇలియానా లవ్‌ ట్రాక్‌ నడిపింది. కాబట్టి, సెబాస్టియనే ఇలియానా కడుపుకు కారణం అని అందరూ అనుకున్నారు.

కానీ, ఇలియానా తాజాగా షాక్ ఇచ్చింది. తాను ఎవరితో రిలేషన్‌లో ఉందనే విషయాన్ని బయట పెట్టింది. తన ప్రియుడి ఫోటోను రివీల్ చేస్తూ ప్రేక్షకులతో ఇలియానా పంచుకుంది. కాకపోతే, గతంలో కత్రినా కైఫ్ సోదరుడు స్టెబాస్టియన్‌ను ఇలియానా డేటింగ్ చేసింది. ఇప్పుడు తాజాగా ఇలియానా షేర్ చేసిన ఫొటోలోని వ్యక్తి కత్రినా కైఫ్ సోదరుడు స్టెబాస్టియన్‌ కాదు. తాజా భాయ్‌ ఫ్రెండ్ కొత్త వ్యక్తి. మరి ఇతను ఎవరు అనేది ? ఇలియానానే చెప్పాలి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే, ఇతను ముంబైకి చెందిన ఓ వ్యాపారి అని టాక్.

Also Read:Amla:ఉసిరితో ఉపయోగాలు

గత కొన్ని నెలల క్రితం వరకూ ఇలియానా – సెబాస్టియన్‌ ల మధ్య ఎఫైర్ నడిచింది. అంతకు ముందు ఇలియానా ఆండ్రూ నీబోన్‌ అనే ఫోటో గ్రాఫర్ తో ఎఫైర్ నడిపింది. ఆ తర్వాత ఆండ్రూ నీబోన్‌ స్థానాన్ని సెబాస్టియన్‌ బాగా కవర్ చేశాడు. ఆ ఫలితంగానే ఇలియానా నెల తప్పింది అనుకుంటున్న సమయంలో ఇప్పుడు కొత్త వ్యక్తి వచ్చి చేరాడు. మరి ఇతగాడైనా ఇలియానా గర్భానికి కారణమో లేదో తెలియాలి.

Also Read:Eyes:అందమైన కళ్ల కోసం

- Advertisement -