ప్రెగ్నెన్సీ హైబీపీ వస్తే ప్రమాదమా ?

32
- Advertisement -

చాలామంది మహిళలకు ప్రెగ్నెన్సి టైమ్ లో రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టూ ముడుతూ ఉంటాయి. తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. ఇవి సాధారణ ఆరోగ్య సమస్యలే అయినప్పటికి ప్రెగ్నెన్సీ టైమ్ లో వాటిని నిర్లక్షం చేయరాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కొందరి గర్భిణీలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఫలితంగా హైబీపీకి దారి తీయడం. ఈ సమస్య పెరిగి రక్త ప్రసరణలో మార్పులు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి గర్భధారణ సమయంలో హైబీపీ బారిన పడితే ప్రాణాలకే తల్లి బిడ్డ ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చారిస్తున్నారు. .

గర్భం దాల్చడానికి ముందు లేదా 20 వారాల తరువాత హైబీపీ కలిగి ఉంటే క్రానిక్ హైబీపీ అంటారు. గర్భదరణ సమయంలో జెస్టేషనల్ హైబీపీ, ప్రీ ఎక్లెంప్సియ అనే ఇతరత్రా బీపీకి సంబంధించిన లక్షణాలు ఉన్నాయో లేదో రెగ్యులర్ గా చెక్ చేసేందుకు డాక్టర్ ను సంప్రదిస్తూ ఉండాలి. జెస్టేషనల్ హైబీపీ ఉన్నవారిలో కడుపులోని శిశువు కూడా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఇక ప్రీ ఎక్లెంప్సియ బారిన పడితే హటాత్తుగా బీపీ పెరిగి నార్మల్ డెలివరీ కాకుండా సీజర్స్ వచ్చే అవకాశం ఉంది.

Also Read:‘చంద్రముఖి 2’  సెన్సార్ రివ్యూ ఇదే 

ఇది మెడికల్ ఎమెర్జెన్సీగా ప్రకటిస్తారు వైద్యులు. దీని వల్ల తల్లి బిడ్డ ప్రాణాలు రిస్క్ లో పడే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి గర్భధారణ సమయంలో హైబీపీ ఉందో లేదో రెగ్యులర్ గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ హైబీపీ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఒకవేళ బీపీ ఎక్కువగా ఉంటే వైద్యులు సూచించిన మందులను మాత్రమే తీసుకోవాలి. అలాగే ఆహారం పట్ల కూడా జాగ్రత్తలు తప్పనిసరి. లిన్ ప్రోటీన్, తృణ ధాన్యాలు, పండ్లు, పాల పదార్థాలు ఎక్కువగా తినాలి. కెఫీన్ పదార్థాలైన టీ కాఫీ లకు దూరంగా సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా సరిగా నిద్రపోతే హైబీపీకి చెక్ పెట్టవచ్చు.

Also Read:డెంగ్యూ యమ డేంజర్.. ఇవి తినండి!

- Advertisement -