మహేష్ కి ‘హనుమాన్’ షాక్ ఇస్తుందా?

26
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గుంటూరు కారం ‘ ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ నెల 6 న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి అదే రోజున ట్రైలర్ రిలీజ్ చేయాలని భావిస్తోంది చిత్ర యూనిట్. ఇక ట్రైలర్ తో మూవీపై మరింత హైప్ రావడం గ్యారంటీ. ఇక సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల చేయబోతున్నారు. ఈ మూవీతో నాన్ బాహుబలి రికార్డ్స్ పై కన్నెశాడు మహేష్ బాబు. అయితే గుంటూరు కారం మూవీని హనుమాన్ మూవీ కంగారు పెడుతోంది. .

మొదట చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. ఈ మూవీ కూడా జనవరి 12 ననే విడుదల అవుతుండడంతో గుంటూరు కారం మూవీకి ఓపెనింగ్ వసూళ్లపై దెబ్బపడే అవకాశం ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే హనుమాన్ మూవీ వాయిదా పడుతుందని అందరూ భావించినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో జనవరి 12న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ గట్టిగా ప్రయత్నిస్తోంది. హనుమాన్ మూవీ టీం కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండడంతో ఈ బాక్సాఫీస్ క్లాష్ ఆసక్తికరంగా మారింది. మరి మహేష్ మేనియా కింద హనుమాన్ నిలబడుతుందా ? లేదా హనుమాన్ తాకిడికి గుంటూరు కారం నష్టపోతుందా అనేది చూడాలి.

Also Read:TTD:6.47 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

- Advertisement -