తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ వల్లిస్తున్న నీతి సూత్రాలు అన్నీ ఇన్ని కావు. నిండా అవినీతిలో కూరుకుపోయిన పార్టీ అభివృద్ది గురించి మాట్లాడడం నిజంగా విడ్డూరమే. తుక్కు గూడలో కాంగ్రెస్ నేతల ప్రసంగాలు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో అక్రమ పాలనకు కేంద్ర బిందువు అయిన కాంగ్రెస్ ను దేశ ప్రజలు 2014లోనే తిరిమేశారు. ఇప్పుడు కొత్తగా అధికారం కోసం పాకులాడుతున్న అంతా తేలికగా కాంగ్రెస్ కపట బుద్దిని నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు. ప్రస్తుతం తెలంగాణ విషయంలో హస్తం నేతలు పెడుతున్న దృష్టి మామూలుగా లేదు. రాష్ట్ర ప్రజలను ఆకర్షించేదుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు ఆ పార్టీ పెద్దలు.
సీడబ్ల్యూసీ సమావేశాల తరువాత తుక్కు గూడలో జరిగిన బహిరంగ సభలో హస్తం పార్టీ ప్రకటించిన హామీలు చూస్తే చేపలకు ఎరా ఆశ చూపినట్లుగా ప్రజలకు హామీల ఆశ చూపుతూ బుట్టలో వేసుకోవాలని కపటప్రేమను చూపిస్తోంది. కర్నాటకలో ఏవైతే హామీలను ప్రకటించారో అవే హామీలను ఇక్కడ కూడా ప్రకటించి తెలంగాణలో అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్నారు హస్తం నేతలు. కర్నాటకలో ప్రకటించిన హామీలను నెరవేర్చలేక అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న హస్తం పార్టీని తెలంగాణ ప్రజలు నమ్ముతారని ఆ పార్టీ నేతలు బహ్వించడం హాస్యాస్పదమే. ప్రస్తుతం సంక్షేమంలోనూ అభివృద్దిలోనూ తెలంగాణను ఆగ్రపథంలో నిలుపుతున్నారు కేసిఆర్.
ప్రస్తుతం కాంగ్రెస్ నామమాత్రపు హామీలను నమ్మితే.. కేసిఆర్ అమలు చేస్తున్న ఎన్నో పథకాలకు బ్రేక్ పడే ప్రమాదం ఉంది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మాత్రమే అమలౌతున్న 24 గంటల ఉచిత కరెంట్ గురించి ఎలాంటి హామీ ప్రకటించలేదు హస్తం పార్టీ. దీన్ని బట్టి ఉచిత కరెంట్ ను రద్దు చేసేందుకు కాంగ్రెస్ సిద్దంగానే ఉందనే విషయం స్పష్టమౌతోంది. ఇక ఆల్రెడీ ముఖ్యమంత్రి కేసిఆర్ అమలు చేస్తున్న పెన్షన్ పథకానే కాంగ్రెస్ కూడా ప్రకటించి రాజకీయ పబ్బం గడపాలని భావిస్తోంది. ఇంకా రైతు బంధు, ధరణి వంటి వాటిని కూడా కాంగ్రెస్ రద్దు చేసే అవకాశం లేకపోలేదు. మొత్తానికి కాంగ్రెస్ కపట మాటలు నమ్మితే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లేనని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. కాంగ్రెస్ ఎన్ని ప్రదర్శనలు చేసిన తెలంగాణ ప్రజలను బోల్తా కొట్టించడం అంతా తేలికైన విషయం కాదనేది ఆ పార్టీ నేతలు గుర్తించుకోవాల్సిన సత్యం.
Also Read:కాకరకాయ జ్యూస్..ఇలా తాగితే రోగాలన్నీ మటాష్!