తెలంగాణలో చంద్రబాబు రిస్క్ చేస్తున్నాడా?

61
- Advertisement -

ఏపీలో జరిగే 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలగా ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అందుకు తగ్గట్టుగానే వ్యహరచన చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈసారి తెలంగాణపై కూడా కాస్త ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారాయన. ఎందుకంటే తెలంగాణలో కూడా టీడీపీకి ఆధారణ ఎక్కువగానే ఉంది. 2014 ఎన్నికల్లో 25 సీట్లు గెలుచుకొని బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ వంటి పార్టీలకు గట్టి పోటీనిచ్చింది. కానీ 2018 ఎన్నికలకు వచ్చేసరి సీన్ మారిపోయింది. ఈ ఎన్నికల్లో కేవలం రెండే సీట్లకు పరిమితం అయినప్పటికి ఆ రెండు సీట్లను కూడా కాపాడుకోవడంలో విఫలం అయింది తెలుగుదేశం పార్టీ.

మరి పార్టీ ఈ స్థాయిలో దిగజారడానికి కారణం కూడా లేకపోలేదు. టీడీపీని ఆంధ్ర ప్రదేశ్ పార్టీగా తెలంగాణ ప్రజలు భావించడం ఒక కారణం అయితే చంద్రబాబు కూడా పెద్దగా దృష్టి సారించకపోవడం మరో కారణం. అయితే ఈసారి మాత్రం అలా కాకుండా వచ్చే ఎన్నికల్లో గట్టిగా సత్తా చాటలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. గత కొన్నాళ్లుగా తెలంగాణలో పార్టీ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించి కార్యకలాపాలలో వేగం పెంచారు. దీన్ని బట్టి చూస్తే ఈసారి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ కూడా బలమైన ప్రత్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్దమనట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Also Read:చేపలు తింటే గుండె జబ్బులు తగ్గుతాయా?

ఇక తాజాగా తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తే స్థానాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 119 స్థానాల్లో పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని తేలిపోయింది. కాగా ప్రస్తుతం తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్, బీజేపీ పార్టీల మద్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఈ పోటీని తట్టుకుని టీడీపీ నిలబడుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. మరి అయినప్పటికి ఎలాంటి పొత్తు లేకుండా 119 స్థానాల్లో టీడీపీ ఎందుకు బరిలోకి దిగుతోంది అనేది ఆసక్తికరమైన ప్రశ్నే. మొత్తానికి తెలంగాణలో అన్నీ స్థానాల్లో పోటీ చేస్తూ చంద్రబాబు రిస్క్ చేస్తున్నారేమో అనే డౌట్లు వ్యక్తమౌతున్నాయి.

Also Read:TTD:అలిపిరి మెట్ల మార్గంపై ఆంక్షలు

- Advertisement -