ఆ రాష్ట్రాలలో క్లీన్ స్వీప్..బీజేపీ టార్గెట్!

19
- Advertisement -

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంపై కన్నేసిన బీజేపీ.. అందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అటు నార్త్ లోనూ ఇటు సౌత్ లోనూ పార్టీ యొక్క బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటూ పార్టీని బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు. అందులో భాగంగానే ఎక్కువ పార్లమెంట్ సీట్లు ఉన్న రాష్ట్రాలపైనే గట్టిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 545 లోక్ సభ స్థానాలు ఉన్న మన దేశంలో అధికారం కోసం 272 సీట్లు సాధించాల్సి ఉంటుంది. అందుకే మెజారిటీ స్థానాలు ఉండే రాష్ట్రాలలో పట్టు సాధిస్తే ఈజీగా అధికారం సాధించవచ్చనేది కమలనాథుల ప్లాన్ గా తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అత్యధిక లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లో 80 సీట్లు, మహారాష్ట్రలో 48 సీట్లు, మధ్యప్రదేశ్ లో 29 సీట్లు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో బీజేపీ హవా గట్టిగానే నడిచింది. .

ఉత్తర ప్రదేశ్ లో 80 సీట్లకు గాను 62 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అలాగే మహారాష్ట్రలో 48 సీట్లకు గాను 23 సీట్లు, మధ్యప్రదేశ్ 29 సీట్లకు గాను 27 సీట్లు బీజేపీ సొంతం చేసుకుంది. అయితే ఈసారి ఈ మూడు రాష్ట్రాలలో క్లీన్ స్వీప్ దిశఃగా టార్గెట్ పెట్టుకున్నారు కమలనాథులు. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో ఒక్క బీజేపీనే 370 సీట్లు సాధించాలానే టార్గెట్ తో కమలనాథులు ఉన్నారు. అందుకే బీజేపీ బలంగా ఉన్న ఈ రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేస్తే అనుకున్న లక్ష్యం సులువౌతుందనే భావనతో కాషాయ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ మూడు రాష్ట్రాలలో సీట్ల కేటాయింపులో కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రాష్ట్రాల్లో పట్టు కోసం కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. హస్తం నేతలు తరచూ ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటనలు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీని కాదని ఈ మూడు రాష్ట్రాలలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

Also Read:వేసవిలో చెరుకురసం తాగుతున్నారా?

- Advertisement -