విడాకుల దిశగా మరో స్టార్ కపుల్?

62
- Advertisement -

ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె భర్త అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారా ?, హిందీ సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు పెటాకులు కావడం అనేది కొత్తేమీ కాదు. ముఖ్యంగా బాలీవుడ్ లో గత మూడు తరాల నుంచి విడాకులు తీసుకోవడం ఆనవాయితీ అయిపోయింది. ఈ క్రమంలోనే ఈ బాలీవుడ్ స్టార్ కపుల్స్ త్వరలో విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. నిజానికి ఈ వార్తలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. తాజాగా అధికారికంగా ఈ జంట విడిపోయారు అని సోషల్ మీడియాలో వార్తలు రౌండ్లు తిరుగుతున్నాయి. మూడు, నాలుగు రోజులుగా హిందీ ప్రధాన పత్రికల్లో కూడా వార్తలు వస్తున్నాయి.

కాకపోతే, అటు ఐశ్వర్య రాయ్ నుంచి గానీ, ఇటు అమితాబ్ బచ్చన్ నుంచి గానీ ఎలాంటి ప్రకటన రాలేదు. తమ విడాకులు అబద్దమని తోసిపుచ్చలేదు. అలాగే అటు నిజమని అంగీకరించలేదు. దీంతో ఈ బాలీవుడ్ స్టార్ కపుల్స్ విడాకుల ప్రచారానికి బలం చేకూర్చింది. దీనికితోడు ఐశ్వర్య రాయ్ ఇటీవలే 50వ పుట్టిన రోజు జరుపుకుంది. ఆ పుట్టిన రోజు వేడుకల్లో బచ్చన్ ఫ్యామిలీ సందడి పెద్దగా కనిపించలేదు. దానికి తోడు ఎప్పుడూ వేలికి వెడ్డింగ్ రింగ్ తొడుక్కునే అభిషేక్ బచ్చన్ ఇటీవల రింగ్ లేకుండానే అన్ని చోట్లా కనిపిస్తున్నాడు. ఇవన్నీ గమనిస్తే.. ఐశ్వర్య రాయ్ బచ్చన్ – అభిషేక్ బచ్చన్ విడిపోయారని అనిపిస్తోంది.

అభిషేక్, ఐశ్వర్య 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. ఐశ్వర్య ఎక్కువగా తన ఇన్ స్టాగ్రామ్ లో తన కూతురు ఆరాధ్య ఫోటోలు షేర్ చేస్తుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో తమ 16వ పెళ్లి రోజు నాడు ఐశ్వర్య “స్వీట్ సిక్స్టీన్” అంటూ అభిషేక్ ని కౌగిలించుకొని ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఆ తర్వాత అభిషేక్ ఫోటో షేర్ చెయ్యలేదు. నెల రోజుల క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య తన భ‌ర్త అభిషేక్ గురించి చెబుతూ.. తాను తన భర్తతో దాంపత్య జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాను అని, అందుకే.. విడాకులు తీసుకున్నాను అని తన సన్నిహితుల దగ్గర చెబుతుందట.

Also Read:ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం..

- Advertisement -