IND vs SA : సఫారీలతో సవాలే!

38
- Advertisement -

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా మరో ఆసక్తికరమైన పోరుకు సిద్దమైంది. సౌతాఫ్రికాతో వారి సొంత గడ్డపైనే మూడు టీ20 మ్యాచ్ లు, మూడు వన్డే మ్యాచ్ లు, రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. అందులో భాగంగానే రేపు తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం ఇరు జట్లు కూడా అత్యంత పటిష్టంగా ఉన్నాయి. రెండు జట్లలో కూడా హార్డ్ హిట్టర్లకు కొడువేమీ లేదు. టీమిండియాలో రుతురాజ్ గైక్వాడ్, జైస్వాల్, సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్ అద్బుత ఫామ్ లో ఉన్నారు. అటు సౌతాఫ్రికాలో అంతకు మించి అనేలా బ్యాటింగ్ విభాగం ఉంది. హెండ్రిక్స్, క్లాసేన్, స్టబ్స్, మిల్లర్, పేలుక్వాయో.. వంటి వారు ఏ దశలోనైనా మ్యాచ్ మలుపు తిప్పేయగల సామర్థ్యం వీరి సొంతం. .

ఇక బౌలింగ్ విషయానికొస్తే కేశవ మహారాజ్, షంషీ, ఎంగిడి వంటి టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. దీంతో సౌతాఫ్రికాను ఎదుర్కోవడం టీమిండియాకు సవాలే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. పైగా సఫారీల గడ్డపై భారత్ కు చెప్పుకోదగ్గ రికార్డులు లేవు. సౌతాఫ్రికాలో జరిగిన టీ20 సిరీస్ లలో భారత్ దే పైచేయిగా ఉన్నప్పటికి వన్డేలలో మాత్రం వెనుకంజలోనే ఉంది. 2006, 2011 లలో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో టీమిండియానే విజయం సాధించింది. ఇకపోతే సఫారీలు వారి గడ్డపై చెలరేగే అవకాశం ఉంది. పైగా ఇటీవల ఆ జట్టుకూడా అద్భుతంగా రాణిస్తోంది. దాంతో సఫారీలను ఎదుర్కోవడం టీమిండియాకు కష్టమే అని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. మరి రేపు జరగనున్న తొలి టీ20 మ్యాచ్ లో విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి.

Also Read:ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం..

- Advertisement -