ఇర్ఫాన్ ఇంటికి బుల్లి పఠాన్‌..

277
- Advertisement -

టీమిండియా సీనియర్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తండ్రయ్యాడు. ఈ సంతోషకర విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. గత ఫిబ్రవరి నెలలో మోడల్ సాఫా బేగ్‌ను ఇర్ఫాన్ వివాహమాడిన సంగతి తెలిసిందే. ఇర్ఫాన్ తండ్రి కావటంతో వారి కుటుంబం సంబరాల్లో మునిగితెలుతోంది.కొత్త ప‌ఠాన్‌ను కుటుంబంలోకి స్వాగ‌తిస్తున్నాం అంటూ ఇర్ఫాన్ ప‌ఠాన్ సోద‌రుడు యూస‌ఫ్ ప‌ఠాన్ ట్వీట్ చేశాడు. త‌న కొడుకులు అయాన్‌,రియాన్‌ల‌కు చిన్న తమ్ముడిని అందించినందుకు సంతోషంగా ఉందంటూ యూస‌ఫ్  అభినందించాడు.

కొడుకు రాక‌తో త‌న దిశ తిరుగుతుంద‌ని మ‌ళ్లీ టీమిండియా జెర్సీ ధ‌రిస్తాన‌ని ఇర్ఫాన్ ఆశాభావం వ్య‌క్తం చేశాడు. గ‌త కొంత‌కాలంగా ఈ లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్ భార‌త జ‌ట్టులో చోటు సంపాదించేందుకు క‌ఠోర సాధ‌న చేస్తున్నాడు. పఠాన్ సోదరులు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి ఎన్నో విజయాలు అందించారు. భారత దాయాది పాకిస్తాన్ పై టెస్టుల్లో తీసిన హ్యాట్రిక్ వికెట్లు ఇర్ఫాన్ బెస్ట్ ప్రదర్శనల్లో ఒకటని చెప్పవచ్చు.

Irfan Blessed With A Baby Boy

- Advertisement -