రూ.5 వేల లిమిట్‌ లేదు…

409
- Advertisement -

పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం నేప‌థ్యంలో అక్రమ డిపాజిట్‌లను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 19న బ్యాంక్‌ డిపాజిట్‌లపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 19నుంచి 30వరకు బ్యాంక్‌ ఖాతాదారులు తమ అకౌంట్లో రూ.5వేలు మాత్రమే జమ చేసుకోవాలని, అంతేగాక రూ.5వేలకు మించి జమ చేస్తున్న సమయంలో ఆలస్యానికి కారణాలు కూడా వెల్లడించాలని రెండు రోజుల క్రితం ఆర్బీఐ పెర్కొంది.

Rs 5000 deposit limit for KYC accounts

అయితే ఈ రోజు ఈ నింబధణలన్నింటినీ ఉపసంహరించుకుంది.దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌యిన ఆగ్ర‌హంతో కేంద్ర ప్ర‌భుత్వం యూట‌ర్న్ తీసుకుంది. డిసెంబ‌రు 19 నాటి స‌ర్క్యుల‌ర్‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 5 వేల పైన చేసే డిపాజిట్ల‌పై కేవైసీ నిబంధ‌న‌ల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు తెలిపింది. ఖాతాదారులు ఎటువంటి వివ‌రాలు తెల‌పాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఐదు వేల‌కు మించి న‌గ‌దును ఎన్ని సార్లైనా డిపాజిట్ చేసుకోవ‌చ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది.

Rs 5000 deposit limit for KYC accounts

పెద్ద నోట్ల రద్దుతో నేటికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంక్‌లో నగదు కొరత కూడా చాలా ఏర్పండింది. బ్యాంక్‌లో నగదు డిపాజిట్‌ చేస్తే కేవలం రూ.4వేలు మాత్రమే ఇస్తున్నారు. అవి కూడా రూ.2000వేల నోట్లే దీంతో చిల్లర కష్టాలు చాలానే ఉన్నాయి. ఐదు వందల రూపాయిలు పెట్టి కూరగాయాలు కొన్న కూడా రూ.2000నోటుకు చిల్లర ఇవ్వడం లేదు స్వైప్‌ మిషన్‌ ద్వారా చెల్లించాలంటే రూ. 500పైగా షాపింగ్‌ చేస్తేనే స్వైప్‌ ద్వారా మనీ తీసుకుంటామని దుకాణాదారులు అంటున్నారు. ఇలా ప్రజల కష్టాలు చాలనే ఉన్నాయి. మొత్తం మీద తమ దగ్గరనున్న పాత కొత్తనోట్లను ఆర్బీఐ పరిమితి లేకుండా అకౌంట్లో వేసుకొవచ్చుఅన్న నిర్ణయంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.

- Advertisement -