సింగర్ మంగ్లీపై కేసు నమోదు

8
- Advertisement -

ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై హైదరాబాద్‌లో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. భారీ స్థాయిలో డబ్బు తీసుకుని మోసం చేసిందనే ఆరోపణలతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, మంగ్లీ తన దగ్గర రూ.10 కోట్లు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. డబ్బు అడిగితే తనను తీవ్రంగా బెదిరించిందని, “శవం కూడా దొరకకుండా చేస్తా” అంటూ ప్రాణహాని కలిగించే విధంగా హెచ్చరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఈ వ్యవహారంలో దాదాపు 150 మందిని మోసం చేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ కుట్రలో దర్శకుడు వేణు ఉడుగుల, అలాగే మంగ్లీ సోదరుడు కూడా భాగస్వాములని పేర్కొన్నారు.

Also Read:తెలంగాణపై పట్టు కొల్పోయిన కాంగ్రెస్

బాధితుడు తనకు ప్రాణహాని ఉందని తెలిపిన నేపథ్యంలో పోలీసులు వెంటనే స్పందించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 351(2), 352 సెక్షన్ల కింద మంగ్లీ, వేణు ఉడుగుల మరియు మంగ్లీ సోదరుడిపై కేసులు నమోదు చేశారు.

- Advertisement -