ఐపీఎల్‌లో మరో హైస్కోరింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని సాధించింది. ఆర్సీబీ పై 6 వికెట్ల తేడాతో గెలిచి వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది రాజస్థాన్.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటిదార్ 40 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోరు అందించాడు. అయితే మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో స్కోరు మరింత పెరగలేదు.రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేశ్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు.
202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. ముఖ్యంగా వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ 26 బంతుల్లోనే 78 పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తిగా తిప్పేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉండటం విశేషం. ధృవ్ జురేల్ సైతం 43 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు. ఈ ఇద్దరి దూకుడు బ్యాటింగ్‌తో రాజస్థాన్ కేవలం 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ టోర్నీలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా, ఆర్సీబీ మాత్రం మరో ఓటమితో నిరాశ చెందింది.
Also Read:తెలంగాణపై పట్టు కొల్పోయిన కాంగ్రెస్

