హర్మూజ్ వేదికగా అమెరికా-ఇరాన్ వార్!

4
- Advertisement -

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ భేరి మోగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను ఒక్కసారిగా పెంచేశాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా సైన్యాన్ని ట్రంప్ ఆదేశించారు. ఇరాన్‌తో తుది యుద్ధానికి మేం సిద్ధం అంటూ ట్రంప్ చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

ఇరాన్ చేతికి ఎట్టి పరిస్థితుల్లోనూ అణుబాంబు దక్కనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.అమెరికా హెచ్చరికలపై ఇరాన్ సైనిక నాయకత్వం అత్యంత కఠినంగా స్పందించింది. తమ భూభాగంపై ఆధిపత్యం చలాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది:

శత్రువులు ఏ చిన్న పొరపాటు చేసినా.. వారు ప్రాణాంతకమైన సుడిగుండాల్లో చిక్కుకుపోవడం ఖాయమని ఇరాన్ హెచ్చరించింది. తమ ప్రాంతీయ జలాల్లోకి చొరబడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా సిద్ధమని ప్రకటించింది.

ALso Read:వరుణ్ తేజ్..’కొరియన్ కనకరాజు’!

ప్రపంచ చమురు వాణిజ్యంలో హర్మూజ్ జలసంధి ఒక “లైఫ్ లైన్” వంటిది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20% నుండి 30% ఈ సన్నని జలమార్గం గుండానే వెళ్తుంది. ఈ మార్గాన్ని దిగ్బంధిస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది.

- Advertisement -