దేశవాళీ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు బీసీసీఐ 2007లో ఐపీఎల్ ను ప్రారంభించింది. అయితే సీజన్లు పెరిగిన కొద్ది జట్ల సంఖ్యను పెంచుతూ కొట్లాది మంది క్రికెట్ ప్రియులకు సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే తాజాగా ఐపీఎల్ ట్రేడింగ్ విండో నేటితో ముగిసింది. ఆయా జట్లు సభ్యులు రిటైన్ చేసుకున్న, వదులుకున్న ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ విడుదల చేసింది.
గత కొన్ని రోజులుగా ఫ్రాంచైజీలన్నీ ఆటగాళ్ల కూర్పుపై కసరత్తు చేసుకున్నాయి. తాజాగా గడువు ముగియడంతో కొంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. మరికొంత మంది సభ్యులను అలాగే ఉంచేసుకున్నాయి. డిసెంబర్‌లో జరిగే మినీ వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్‌కు సమర్పించింది. ప్రతి జట్టుకు వేతనం కోసం కేటాయించిన రూ.90కోట్ల శాలరీ క్యాప్‌కు అదనంగా రూ.5కోట్లు ఉంటాయి. కాగా డిసెంబరు 16న కోచిలో వేలం జరిగే అవకాశం ఉంది.
ఆసీస్ లెఫ్టార్మ్ పేసర్ జానస్ బెహ్రెండార్ఫ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుంచి ముంబై కొనుగోలు చేసింది. అయితే, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు మాత్రం ట్రేడింగ్ విండోలో మౌనంగా ఉండిపోయాయి.
పంజాబ్ ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి మయాంక్ అగర్వాల్‌ను తొలగించి శిఖర్ ధావన్‌కు బాధ్యతలు అప్పగించింది. అంబటి రాయుడు, రవీంద్ర జడేజాలను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. వెటరన్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావోను చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేయగా, కేన్ విలియమ్సన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసింది.
ట్రేడింగ్ విండోను కోల్‌కతా నైట్ రైడర్స్ చక్కగా ఉపయోగించుకుంది. ఢిల్లీ కేపిటల్స్ నుంచి శార్దూల్ ఠాకూర్‌ను, డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ నుంచి న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గ్యూసన్, ఆఫ్ఘనిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మతుల్లా గుర్బాజ్‌ను కొనుగోలు చేసింది. అలాగే, అమన్ ఖాన్‌ను ఢిల్లీ కేపిటల్స్‌కు ఇచ్చేసింది.
ముంబై ఇండియన్స్ విధ్వంసకర ఆటగాడు కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే. 5సార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌కు పొలార్డ్ 12 ఏళ్లు ప్రాతినిధ్యం వహించాడు. గత సీజన్‌లో ముంబై రూ.6 కోట్లతో పొలార్డ్‌ను రిటైన్ చేసుకుంది. అయితే, ఆ సీజన్‌లో పొలార్డ్ దారుణంగా నిరాశ పరిచాడు. ఇక,
ఇవి కూడా చదవండి..
ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన కీరన్..
ఇండియన్ రేస్ లీగ్ టికెట్లు లభ్యం లింక్ ఇదే..
బీజేపీపై ఇక పోరాటమే