వైభవ్ ..రికార్డులు బ్రేక్!

6
- Advertisement -

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఈ రసవత్తర పోరు ఐపీఎల్ ప్లేఆఫ్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు నమోదైన ఆల్-టైమ్ రికార్డును కూడా బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసి టోర్నమెంట్‌లో క్వాలిఫైయర్ 2కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్..హైదరాబాద్ బౌలర్లను చీల్చిచెండాడాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరు సాధించగా ఆ తర్వాత ఎస్ఆర్‌హెచ్‌ను 196 పరుగులకే పరిమితం చేసి 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ హై-స్కోరింగ్ మ్యాచ్ ఐపీఎల్ ప్లేఆఫ్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును తిరగరాసింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 26 సిక్సర్లు నమోదయ్యాయి. గతంలో 2025 ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్ (MI) – గుజరాత్ టైటాన్స్ (GT) మ్యాచ్‌లో నమోదైన 25 సిక్సర్ల రికార్డును ఇది అధిగమించడం విశేషం.

Also Read:పద్మనాభస్వామి ఆలయంలో వజ్రాలు మాయం!

- Advertisement -