హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్‌కు చెందిన డ్రోన్లను అమెరికా బలగాలు కూల్చివేసిన తర్వాత…ఇరాన్ సైనిక స్థావరంపై అమెరికా తాజా రక్షణాత్మక దాడులను నిర్వహించిందని ఆ దేశ అధికారులు తెలిపారు. హోర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఇరాన్‌కు చెందిన నాలుగు వన్-వే అటాక్ డ్రోన్లను యూఎస్ సెంట్రల్ కమాండ్ బలగాలు అడ్డుకుని ధ్వంసం చేశాయని అధికారులు పేర్కొన్నారు.
అలాగే ఐదో డ్రోన్‌ను ప్రయోగించడానికి సిద్ధమవుతున్న బందర్ అబ్బాస్‌లోని ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌ను కూడా అమెరికా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ తాజా సైనిక చర్య ఈ వారంలో ఇరాన్‌పై అమెరికా చేసిన రెండవ దాడి . వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ దాడి చోటుచేసుకుంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆందోళనకు కారణమైన ఈ వివాదాన్ని ముగించేందుకు నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నికల కోసం తాను తొందరపడి ఎలాంటి ఒప్పందాన్ని చేసుకోబోనని ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆయన వ్యాఖ్యానించిన తర్వాత ఈ దాడులు జరిగాయి.
ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్‌తో ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చలు ఇంకా పురోగతిలోనే ఉన్నాయని తుది నిర్ణయం కాలేదని అధికారులు సూచించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా పతనమైందని అక్కడ ద్రవ్యోల్బణం 250 శాతానికి పెరిగిందని ఇరాన్ కరెన్సీ తన విలువను పూర్తిగా కోల్పోయిందని వివరించారు.
Also Read:పద్మనాభస్వామి ఆలయంలో వజ్రాలు మాయం!

