ఐపీఎల్ 2024 ఆధ్యంతం ప్రేక్షకులను అలరిస్తోంది. శుక్రవారం కోల్ కతా వేదికగా జరిగిన ఆసక్తికర మ్యాచ్‌లో భారీ టార్గెట్‌ని చేధించి ఔరా అనిపించింది పంజాబ్. 262 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ మని ఉదేసింది. ఆరంభం నుండే కోల్ కతా బౌలర్లపై విరుచుక పడుతూ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది పంజాబ్.
ప్రభసిమ్రాన్ సింగ్ 20 బంతుల్లో 5 సిక్స్లు,4 ఫోర్లతో 54 పరుగులు చేయగా బెయిర్ స్టో 48 బంతుల్లోనే 9 సిక్స్‌లు,8 ఫోర్లతో 108,శశాంక్ సింగ్ 28 బంతుల్లో 8 సిక్స్లు,2 ఫోర్లతో 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించారు. బెయిర్ స్టోకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (75), సునీల్ నరైన్ (71) హాఫ్ సెంచరీలతో హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్లుగా నిలవగా, వెంకటేష్ అయ్యర్ (39), ఆండ్రీ రెస్సెల్ (24), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (28) రాణించారు.
Also Read:Revanth:BJP..బ్రిటిష్ జనతా పార్టీ