బీసీసీఐ నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుపై దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. ఎర్నాకులంకు చెందిన అషిక్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేస్తూ, IPL దేశానికి అధికారిక క్రికెట్ టోర్నమెంట్ కాదని, అందువల్ల “ఇండియన్ ప్రీమియర్ లీగ్” అనే పేరును ఉపయోగించడం చట్ట విరుద్ధమని వాదించారు.
అయితే చీఫ్ జస్టిస్ సౌమెన్ సేన్, జస్టిస్ శ్యామ్ కుమార్ వి.ఎం.లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వాదనలో ఎలాంటి బలం లేదని తేల్చి, పిటిషన్‌ను విచారణకు తీసుకోకుండా కొట్టివేసింది.
IPL 2008లో ప్రారంభమై, తొలుత ఎనిమిది జట్లతో సాగి, ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద టి20 లీగ్‌గా ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లు ఇందులో పాల్గొంటున్నారు.
ఇక 19వ సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య చిదంబరం స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.
కాగా, గతంలో జరిగిన ప్రమాదం కారణంగా సందేహంలో ఉన్న ఈ స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అన్ని భద్రతా చర్యలను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో బెంగళూరులో IPL మ్యాచ్‌ల నిర్వహణకు మార్గం సుగమమైంది.
Also Read:మళ్లీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్?

