భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు ఎక్స్ ద్వారా వెల్లడింది. దేశం మొత్తం ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి సమయంలో ఆటగాళ్లతోపాటు ప్రేక్షకుల భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది బీసీసీఐ.
గత కొన్ని రోజులుగా సరిహద్దు వద్ద పాక్ వైపు నుంచి రెచ్చగొట్టే చర్యలు పెరిగిన వేళ, విదేశీ ఆటగాళ్ల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు సీనియర్ ప్లేయర్లను వెనక్కి పిలుచుకోవాలని ఆలోచిస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో బోర్డు ఆధ్వర్యంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఐపీఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా నిలిపివేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే ఉద్రిక్తతల కారణంగా గురువారం జరగాల్సిన పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను అర్దాంతరంగా రద్దు చేశారు. అలాగే ఈనెల 11 న ముంబై ఇండియన్స్, పంజాబ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ను ముంబైకి షిఫ్ట్ చేశారు.

పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ రద్దుకు ముందు ధర్మశాలకు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్ములో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసినట్లు తెలుస్తోండగా మిగితా ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా బీసీసీఐ అత్యవసర సమావేశంలో వారం రోజుల పాటు వాయిదా వేశారు.
Also Read:త్రివిధ దళాలతో రాజ్‌నాథ్ భేటీ!

