IPL 2024 :ఆర్సీబీకి ‘డూ ఆర్ డై’?

63
- Advertisement -

ఎన్నో అంచనాలతో ఈసారి ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఎవరు ఊహించని రీతిలో వరుస వైఫల్యాలను ఎదుర్కొంటుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క విజయం సాధించి అయిదింట్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లినతో పాటు రేస్ లో నెలవాలంటే ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇకపై అన్నీ మ్యాచ్ లు గెలిస్తేనే టైటిల్ రేస్ లో ఆర్సీబీ నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ పూర్తిగా విఫలం అవుతోంది. బ్యాటింగ్ లో కోహ్లీ మినహా మిగిలిన బ్యాట్స్ మెన్స్ ఎవరు పెద్దగా రాణించడం లేదు. డూప్లిసిస్, దినేష్ కార్తీక్ వంటి వారు రాణిస్తున్నప్పటికి స్థాయికి తగ్గ ప్రదర్శన కాదనేది క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. హార్డ్ హిట్టర్ గా పేరున్న మాక్స్ వెల్ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. అటు బౌలింగ్ లో కూడా ఆర్సీబీ ఘోరంగా విఫలం అవుతోంది. దీంతో ఆ జట్టు లీగ్ దశలోనే వెనుదిరుగుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.

‘రైజర్స్’ తో డేంజర్

నేడు జరిగే మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. ప్రస్తుతం సన్ రైజర్స్ జట్టు అద్బుతమైన ఫామ్ లో ఉంది. బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోనూ ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ హైదరబాద్ జట్టు మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. దీంతో సన్ రైజర్స్ జట్టును ఎదుర్కోవడం ఆర్సీబీకి పెద్ద సవాలే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. మరి. రైజర్స్ పై ఆర్సీబీ పైచేయి సాధించి రేస్ లో నిలుస్తుందా ? లేదా ఓటమి పరంపర కొనసాగిస్తుందా అనేది చూడాలి.

Also Read:తాటి ముంజలు తింటే ఎన్ని లాభాలో!

- Advertisement -