IPL 2023 : ఫైనల్ కు వెళ్ళేదేవరు..?

48
- Advertisement -

ఐపీఎల్ చివరి అంకానికి వచ్చింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కు చేరుకోగా.. మరో ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడుతున్నాయి. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. క్వాలిఫయర్ 2 కు అర్హత సాధించిన ముంబై.. ఫైనల్ కు చేరాలంటే గుజరాత్ ను ఓడించాల్సి ఉంటుంది. ఇక క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఓటమిపాలు అయిన గుజరాత్ టైటాన్స్.. క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ముంబై పై గెలిచి ఫైనల్ లోకి అడుగు పెట్టాలని చూస్తోంది. ఇక కప్పు వేటలో పోటీ పడుతున్న సిఎస్కే, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు మూడు కూడా ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచినవే.

Also Read:కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సదస్సు..

చెన్నై ఇప్పటివరకు నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవగా, ముంబై 5 సార్లు టైటిల్ గెలిచింది. ఇక గుజరాత్ గత ఏడాది ఐపీఎల్ కప్పు సాధించి డీపెండింగ్ ఛాంపియన్ గా నిలిచింది. దాంతో ఈ మూడు జట్లలో ఈ సీజన్ ఐపీఎల్ లో ఏ జట్టు కప్పు గెలుస్తుందో అనే క్యూరియాసిటి అందరిలోనూ ఉంది. ఇక ఫైనల్ కు వెళ్ళేందుకు రేపు గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ పోటీ పడనున్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు కూడా పటిష్టంగానే కనిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ అల్ రౌండ్ ప్రధర్శనతో అదరగొడుతోంది. అటు గుజరాత్ టైటాన్స్ కూడా మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటుతోంది. దీంతో ఇరు జట్లలో ఏ జట్టు ఫైనల్ కు వెళుతుందో చూడాలి. ఇక ఫైనల్ కు వెళ్ళిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో ఈ నెల 28న తలపడనుంది.

Also Read:ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినోత్సవం..

- Advertisement -