IPL 2023:కింగ్స్ vs రాయల్స్.. తగ్గేదెలే!

56
- Advertisement -

ఐపీఎల్ నేటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 నిముషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇరు జట్లు కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు జట్లు కూడా చెరో రెండు విజయాలను ఖాతాలో వేసుకొని మూడో విజయం కోసం తహతహలాడుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ చెన్నై మరియు రాజస్తాన్ మద్య 26 మ్యాచ్ లు జరగగా అందులో చెన్నై 15 మ్యాచ్ లలోనూ, రాజస్తాన్ 11 మ్యాచ్ లలోనూ విజయం సాధించాయి.

ఓవరాల్ గా చెన్నై రికార్డ్ మెరుగ్గా ఉన్నప్పటికి రాజస్తాన్ ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయలేము. ఆ జట్టు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. ఇరు జట్లలో బలమైన బ్యాట్స్ మెన్స్, పదునైన బౌలర్స్, ఏ క్షణంలో నైనా మలుపుతిప్పగలిగే అల్ రౌండర్స్ ఇలా అన్నీ విభాగాల్లోనూ సమంగా నిలుస్తాయి. చెన్నైసూపర్ కింగ్స్ లో ఋతురాజ్ గైక్వార్డ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అతనితో పాటు అంబటి రాయుడు, రహనే, ఎం‌ఎస్ ధోని చెన్నై కి ప్రధాన బలం..ఇక బెన్ స్టోక్స్, మొయిన్ అలీ వంటి హార్డ్ హిట్టర్స్ కూడా చెన్నైకి మరో బలం.

అయితే బ్యాటింగ్ విషయంలో పటిష్టంగానే ఉన్నప్పటికి బౌలింగ్ లో కాస్త తడబడుతోంది చెన్నై. అయితే దీపక్ చహార్, కాన్వే వంటి వాళ్ళు రాణిస్తే చెన్నై కి తిరుగుండదు. ఇక రాజస్తాన్ అటు బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ చెన్నై కంటే మెరుగ్గా కనిపిస్తోంది. బట్లర్, రూట్, సంజు సంసన్ వంటి బ్యాట్స్ మెన్ తో పాటు ట్రెంట్ బోల్ట్, చహల్, పడిక్కర్ వంటి బౌలర్స్ రెచ్చిపోతే రాజస్తాన్ కు గెలుపు నల్లేరు మీద నడకే. మొత్తాని రెండు బలమైన జట్ల మద్య జరిగే ఈ మ్యాచ్ హోర హోరీగా ఉండే అవకాశం ఉంది. ఇక నిన్న ముంబై డిల్లీ మద్య జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -