ఐపీఎల్ 2023లో భాగంగా ముంబైకి భంగపాటు తప్పలేదు. వాంఖడే వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పంజాబ్ విధించిన 215 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓ దశలో ముంబై గెలుపు ఖాయమని అంతా భావించిన చివరలో పంజాబ్ బౌలర్లు రాణించడంతో ముంబై ఓటమి తప్పలేదు.
కామెరూన్ గ్రీన్ (67; 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(57; 26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలతో దుమ్మురేపగా రోహిత్ శర్మ(44; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో టిమ్ డేవిడ్(25 నాటౌట్; 13 బంతుల్లో 2సిక్సర్లు) లు జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కానీ పంజాబ్ బౌలర్ల ముందు ముంబై బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు.పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు తీయగా నాథన్ ఎల్లిస్, లియామ్ లివింగ్‌స్టోన్ చెరో వికెట్ పడగొట్టారు.
Also Read:మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ వేదిక పిలుపు
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్(26; 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు), అథర్వ తైడే(29; 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ,సామ్ కరణ్ 55,జీతెన్ శర్మ 25 పరుగులు చేశారు.
Also Read:విస్తరిస్తున్న బిఆర్‌ఎస్.. కారణం అదే!