IPL 2023:రైజర్స్ vs ముంబై.. ఢీ!

31
- Advertisement -

నేటి ఐపీఎల్ మ్యాచ్ ముంబై వర్సస్ హైదరబాద్ మద్య జరగనుంది. హైదరబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన ఇరు జట్లు చెరో రెండు విజయాలను ఖాతాలలో వేసుకొని సమంగా నిలిచాయి. దాంతో ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో అనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది. గత మ్యాచ్ కోల్ కతా పై 228 పరుగులు చేసి ఈ సీజన్ లోనే హయెస్ట్ స్కోర్ చేసి అద్బుత విజయాన్ని అందుకున్న సన్ రైజర్స్ నెస్ట్ ముంబై తో జరిగే మ్యాచ్ లోనూ ఇదే జోరు కొనసాగించాలని చూస్తుంది. ఇక గత మ్యాచ్ లో విధ్వంసం సృస్టించిన హ్యారీ బ్రూక్స్ ఈ మ్యాచ్ లో కూడా చెలరేగితే ఎస్ఆర్హెచ్ కు తిరుగుండదు. .

ఇక బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవారం లేదు బెస్ట్ ఫేస్ దళం హైదరబాద్ సొంతం. దాంతో బ్యాటింగ్ లో రాణిస్తే ప్రత్యర్థి టిమ్ ను బౌలింగ్ లో కట్టడి చేయడం ఈజీనే. మరోవైపు ముంబై కూడా కోల్ కతా పై జరిగిన గత మ్యాచ్ లో విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం ముంబై కి కలిసొచ్చే అంశం. ఇక ఎస్ఆర్హెచ్ తో జరిగే మ్యాచ్ లో హిట్ మ్యాన్ ఎలాంటి మెరుపులు మెరిపిస్తారో చూడాలి.

ఇక రోహిత్ కు తోడు మిడిలార్డర్ బ్యాట్స్ మెన్స్ కూడా ఫామ్ లోకి వస్తే ముంబై కి తిరుగుండదు. అటు బౌలింగ్ లోనూ ముంబై పేస్ దళం బలంగానే కనిపిస్తోంది. దాంతో ముంబై మరియు హైదరబాద్ మద్య జరిగే ఈ మ్యాచ్ ఉత్కంఠభరింతగా సాగే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ మొత్తం లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 18 సార్లు తలపడగా చెరో 9 విజయాలను ఖాతాలో వేసుకొని సమంగా ఉన్నాయి. మరి ఈ సారి విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి. ఇక నిన్న బెంగళూరు వర్సస్ చెన్నై మద్య జరిగిన మ్యాచ్ లో చెన్నై అద్బుత విజయాన్ని కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 6 వికెట్ల నష్టానికి నిర్ణీత ఓవర్లలో 226 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు ముందు ఉంచగా బెంగళూరు 216 పరుగులు చేసి ఓటమి పాలు అయింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -