నేటి ఐపీఎల్ మ్యాచ్ లో డిల్లీ క్యాపిటల్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్ బెర్త్ ల కోసం ఆసక్తికరమైన పోటీ నడుస్తున్న క్రమంలో ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి డిల్లీ నిష్క్రమించింది. అటు పంజాబ్ కు కూడా ప్లే ఆఫ్ అవకాశలు సంక్లిష్టంగానే ఉన్నాయి. ప్రస్తుతం డిల్లీతో జరిగే మ్యాచ్ తో పాటు మిగిలిన రెండు మ్యాచ్ లలో కూడా తప్పక గెలవాల్సిన పరిస్థితి. అయినప్పటికి కూడా ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడవలసి ఉంటుంది. డిల్లీ, పంజాబ్ రెండు జట్లు కూడా చెరో 12 మ్యాచ్ లు అడగా.. డిల్లీ అరింట్లో, పంజాబ్ నాలుగింట్లో విజయం సాధించాయి. దాంతో పాయింట్ల పట్టికలో చివరినుంచి ఒకటి, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి ఈ రెండు జట్లు. .
ఈ సీజన్ లో డిల్లీ క్యాపిటల్ మొదటి నుంచి కూడా అత్యంత ఫెళవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తూ వాచ్చింది. అటు పంజాబ్ మొదట్లో కాస్త పరవాలేదనిపించిన.. ఆ తరువాత వరుస ఓటమిలతో రేస్ లో వెనుకబడింది. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలిస్తే ప్లే ఆఫ్ రేస్ లో ఉంటుంది. ఒకవేళ డిల్లీ గెలిచిన ప్లే ఆఫ్ కు వెళ్ళే అవకాశాలు లేవు. కానీ డిల్లీ గెలిస్తే అటు పంజాబ్ జట్టుకు ముప్పే. ఎందుకంటే డిల్లీ ఇంటికి వెళ్తూ వెళ్తూ పంజాబ్ జట్టును కూడా ఇంటిముఖం పట్టిస్తుంది. అందువల్ల ఈ మ్యాచ్ లో గెలవడం డిల్లీ కంటే పంజాబ్ జట్టుకే అత్యంత కీలకం అని చెప్పవచ్చు. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో లక్నో ప్లే ఆఫ్ రేస్ లో మరింత ముందుకు సాగగా ముంబై రేస్ లో కాస్త వెనకబడింది. మొత్తానికి ప్లే ఆఫ్ బెర్త్ లపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.