బిగ్ బాస్ 5…హమీద ఎలిమినేట్

39
hamida

బిగ్ బాస్ 5 తెలుగు విజయవంతంగా 5 వారాలు పూర్తి చేసుకుంది. 5వ వారంలో భాగంగా ఇంటి నుండి హమీద ఎలిమినేట్ అయ్యారు . హమీద ఎలిమినేషన్‌తో శ్రీరామచంద్ర కన్నీటి పర్యంతం అయ్యారు. తర్వాత ఇంటి నుండి బయటకు వచ్చిన హమీద.. ఒక్కొక్కరి గురించి మంచి చెడులను చెప్పింది. శ్రీరాం మంచివాడు. ఏం జరిగినా వెంటనే క్లియర్ చేసుకోవాలని అనుకుంటాడు. జెస్సీ విషయంలోనూ శ్రీరాం రాత్రంతా తినకుండానే ఉన్నాడు అని ఇలా ఇంటి సభ్యులందరి గురించి హమీద చెప్పింది.

మానస్ మంచోడే కానీ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదని చెప్పింది. కాజల్ అయితే నకిలీ మనిషి. ఆమె బంధాలకు విలువ ఇవ్వదని హమీద పేర్కొంది. సిరి అయితే అటూ ఇటూ ఫ్లిప్ అవుతుందని తెలిపింది. ప్రియాంక ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదని తెలిపింది. ప్రియ విషయంలో నాకు ఓ గిల్ట్ ఉండేది. కెప్టెన్ కాకుండా చేశాను అని. కానీ అది ఈ వారంతో పోయిందన్నారు.

ఆనీ మాస్టర్ చాలా మంచివారు. నాకు అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు ఆమె దగ్గరికి వెళ్తుంటానని తెలిపింది. నా వరకు రవి అన్నయ్య చాలా మంచోడు. నాకు ఎప్పుడూ తోడుగా ఉండేవాడని తెలిపింది. విశ్వ.. ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడు. తెలియకుండా మాట్లాడితే.. మళ్లీ వాటిని వెనక్కి తీసుకోలేం. ఎదుటి వారి గురించి ఎదురుచూడకుండానువ్వే వెళ్లి మాట్లాడని అని హితవు పలికింది.