కరోనా ఎఫెక్ట్‌.. ఐపీఎల్‌ వాయిదా..!

285
ipl

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక చర్యలను తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ విష‌యంలో ప‌లు చ‌ర్చ‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఐపీఎల్‌ని బ్యాన్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టిస్తున్నాయి.

అంతేకాదు కరోనా ప్రభావం కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ నిర్వహించాలని మొదట భావించిన బీసీసీఐ, ఇప్పుడు మనసు మార్చుకుంది. ఐపీఎల్ ప్రారంభ తేదీని వాయిదా వేసింది.

ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ తాజా సీజన్ మార్చి 29న ప్రారంభం కావాలి. దాంతో ఐపీఎల్ ప్రారంభాన్ని ఏప్రిల్ 15కి వాయిదా వేశారు. అప్పటికీ కరోనా అదుపులోకి రాకపోతే ఆపై తదుపరి నిర్ణయం తీసుకుంటారు.