ఐపీఎల్ 2020పై మళ్లీ ఆశలు చిగురించాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు వాయిదా పడుతూ వస్తున్న ఐపీఎల్‌పై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఐపీఎల్ 13వ సీజన్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందుకు అనుగుణంగా ఐపీఎల్ ను విదేశాలలో జరపాలని అనుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. శ్రీలంక లేదా యూఏఈ నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నామని ఈ రెండు దేశాలు ఐపీఎల్ 2020ని నిర్వహించుందుకు ఆసక్తిచూపుతున్నాయని తెలిపారు. ఐపీఎల్ నిర్వహణ సమయానికి ఏ దేశంలోనైతే కరోనా ప్రభావం తక్కువగా ఉంటుందో అక్కడ ఈ లీగ్ ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు.
ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్ నిర్వహించాలని చూస్తున బీసీసీఐ ఆ మధ్య అన్ని ఫ్రాంచైజీలకు, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు ఐపీఎల్ కోసం సిద్ధంగా ఉండాలని లేఖ రాసింది. కరోనా ప్రభావం తగ్గితే లీగ్ ను నిర్వహించుదాం అనుకున్న బీసీసీఐ ఆలోచనలు తారుమారయ్యాయి.దీంతో భారత్‌లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల వైపు బీసీసీఐ చూస్తోంది.