IPL 17:విండీస్ కెప్టెన్‌కు రికార్డు ధర

117
- Advertisement -

ఐపీఎల్ 17వ సీజన్ మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుండగా ఇందుకు సంబంధించిన మినీ వేలంలో ఆటగాళ్లను దక్కించుకునేందుకు ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. ఇక తొలి రౌండ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మ‌న్ పావెల్‌ను రికార్డు ధరకు దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్. రూ. 7.40 కోట్లకు ఆర్ఆర్ దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇండియా వెలుపల వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

భారత్‌కు చెందిన అన్‌క్యాప్డ్ బౌలర్ ఆకాశ్ మహారాజ్ సింగ్‌ను రూ. 20 లక్షలకు సన్‌రైజర్స్ దక్కించుకోగా కార్తిక్ త్యాగీని రూ. 60 లక్షలకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.యశ్ దయాల్‌ను రూ. 5 కోట్లకు ఆర్సీబీ, సుశాంత్ మిశ్రాను రూ. 2.20 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసింది.షారుక్ ఖాన్ కోసం గుజరాత్, పంజాబ్ మధ్య పోటీ జరుగగా చివరికి రూ. 7.40 కోట్లకు దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్.

ట్రావిస్ హెడ్ ను హైద‌రాబాద్ రూ.6.80 కోట్ల‌కు , హ్యారీ బ్రూక్‌ను రూ. 4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్, ద‌క్షిణాఫ్రికా స్టార్ బ్యాట‌ర్ రీలే ర‌స్సో అమ్ముడు పోలేదు ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్, భార‌త క్రికెట‌ర్లు క‌రుణ్ నాయ‌ర్, మ‌నీశ్ పాండేల‌ను సైతం ఎవ‌రూ కొనుగోలు చేయ‌లేదు.

Also Read:నో టికెట్.. వారిలో టెన్షన్?

- Advertisement -