నయా ఫీచర్స్‌తో ఐఫోన్‌ 11 వచ్చేసింది..

227
iphone

ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ ఫోన్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తోన్న కొత్త ఐఫోన్‌లను యాపిల్‌ విడుదల చేసింది. ఐఫోన్‌ 11,11 ప్రో, 11 ప్రో మ్యాక్స్‌ అధునాతన స్మార్ట్‌ఫోన్‌లను యాపిల్‌ కాలిఫోర్నియాలోని హెడ్‌క్వార్టర్స్‌ క్యుపర్టినోలోని స్టీవ్‌ జాబ్స్‌ ఆడిటోరియమ్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో ఆవిష్కరించారు.

iPhone11

ఐఫోన్‌ 11 ఆరు రంగుల్లో లభ్యం కానున్నది. కొత్తగా గ్రీన్,పర్పుల్‌ రెడ్, యెల్లో రంగుల్లో లభించనున్నది. స్పెషల్‌ ఆడియో, డాల్బీ అట్మోస్‌ ఫీచర్, ఇరువైపులా 12 మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 6.1 లిక్విడ్‌ రెటినా డిస్‌ప్లే, స్లో మోషన్‌ సెల్ఫీలు, ఏ13 బయోనిక్‌ చిప్‌ వంటి ప్రత్యేకతలున్నాయి. ఐఫోన్‌ 11 ధర 699 డాలర్ల నుంచి మొదలవుతుంది. ఈ ఫోన్లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. ఐఫోన్ 11 సిరీస్ ప్రారంభ ధర రూ.64,900. ఇండియాలో సెప్టెంబర్ 27న సేల్ ప్రారంభం కానుంది.