ప్రెజర్ కుక్కర్‌లో ‘ఆవిరి’…ఫస్ట్ లుక్‌

414
aaviri firstlook

విభిన్న క‌థా చిత్రాల‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు. ఇటీవలె పందిపిల్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రవిబాబు తాజాగా ఆవిరిగా ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. ఫ్లైయింగ్ ప్రాగ్స్ చిత్రాన్ని నిర్మిస్తుండగా స‌క్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు త‌న సొంత బేన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్‌పై సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. స్టౌ మీద కొంచెం తెరిచి ఉంచిన ప్రెజర్ కుక్కర్, దానిలో కళ్లు తెరిచి ఆశ్చర్యంగా చూస్తోన్న మనిషి తల, కుక్కర్ లోపల నుంచి బయటికి వస్తోన్న ఆవిరి ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి.

క్రైమ్ థ్రిల్లర్‌గా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రవిబాబుతో పాటు నేహా చౌహాన్, శ్రీ ముక్త, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వైధ్య్ సంగీతం సమకూరుస్తున్నారు.