మండలి ఛైర్మన్‌గా గుత్తా…ఏకగ్రీవ ఎన్నిక

559
ktr

తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలి ఛైర్మన్‌గా గుత్తా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. సీఎం కేసీఆర్,మంత్రులు గుత్తాకు విషెస్ చెప్పారు.

మంత్రులు కేటీఆర్,హరీష్,వేముల ప్రశాంత్ రెడ్డి,బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు,కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,కర్నె ప్రభాకర్ తదితరులు మండలి ఛైర్మన్ కు విషెస్ చెప్పారు.

గుత్తా నామినేషన్‌ను ఏడుగురు మండలి సభ్యులు ప్రతిపాదించారు. కడియం శ్రీహరి,నాయిని నర్సింహారెడ్డి, కర్నెప్రభాకర్, జి. సునీత, సత్యవతి రాథోడ్ ,కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి,ఎంఐఎం సభ్యుడు కూడా గుత్తా అభ్యర్ధిత్వాన్ని బలపర్చారు. ఈ నెల 14 నుంచి 22 వరకు శాసన మండలి సమావేశాలు జరుగనున్నాయి.