ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే..లాభాలే!

4
- Advertisement -

ఈ ఐదు స్టాక్స్‌లో పెట్టుబడులు పెడితే లాభాలను ఆర్జించవచ్చని ట్రేడ్ నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఇన్ఫోసిస్ , టెక్ మహీంద్రా, ఎన్‌ఎండీసీ,కోల్ ఇండియా, ,ఎన్‌బీసీసీ ఉన్నాయి.

ఇన్ఫోసిస్ ఈ ఐటీ దిగ్గజం షేరులో సానుకూల కదలిక ఉందని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇన్ఫోసిస్ షేరును రూ. 1,250 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చని … ట్రేడర్లు రూ. 1,180 వద్ద స్టాప్ లాస్ పాటించాలని సూచించారు.

ప్రస్తుత మార్కెట్ ధర రూ. 93.7 వద్ద ఎన్‌ఎండీసీ షేరులోకి ఎంటర్ అవ్వాలని… దీని టార్గెట్ ధర రూ. 100 గా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఈ పొజిషన్‌కు రూ. 89 వద్ద స్టాప్ లాస్ ఉంచాలని సలహా ఇస్తున్నారు ఎక్స్‌పర్ట్స్.

ఎన్‌బీసీసీలో కూడా మంచి మొమెంటం ఉందని ప్రస్తుత మార్కెట్ ధర రూ. 104 వద్ద కొనుగోలు చేసి…రూ. 108 మరియు రూ. 114 టార్గెట్లను లక్ష్యంగా పెట్టుకోవచ్చని చెబుతున్నారు. ట్రేడర్లు రూ. 99 వద్ద కఠినమైన స్టాప్ లాస్ పాటించాలని కోరారు.

Also Read:తెలంగాణను కాపాడుకుందాం!

అలాగే కోల్ ఇండియా షేరును ప్రస్తుత మార్కెట్ ధర రూ. 473 వద్ద కొనుగోలు చేయవచ్చని…దీని టార్గెట్ రూ. 505 అని చెబుతున్నారు. నష్టాలను నివారించడానికి ట్రేడర్లు రూ. 455 వద్ద స్టాప్ లాస్ ఉంచుకోవాలని సూచించారు. టెక్ మహీంద్రా షేరును ప్రస్తుత మార్కెట్ ధర రూ. 1,510 వద్ద కొనుగోలు చేయవచ్చని…దీని టార్గెట్ ధర రూ. 1,663 అని సిఫార్సు చేశారు. డౌన్‌సైడ్ రిస్క్‌ను నిర్వహించడానికి రూ. 1,495 వద్ద స్టాప్ లాస్ ఉంచాలని సూచించారు.

గమనిక : వినియోగదారులు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా నిపుణులను సంప్రదించాలి.

- Advertisement -