‘అల్లరి’ నరేష్ హీరోగా భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి. పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన హార్రర్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ డిసెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ విశేషాలను గురించి పత్రికల వారికి తెలియజేశారు.
నరేష్ పర్‌ఫెక్ట్‌గా యాప్ట్ అయ్యాడు!!
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ – ”దర్శకుడు నాగేశ్వరరెడ్డితో ఎప్పట్నుంచో సినిమా చెయ్యాలనుకున్నాను. ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేశాను. అలాగే ఈ కథకి నరేష్ అయితే పర్‌ఫెక్ట్‌గా యాప్ట్ అవుతాడని నరేష్‌ని సెలెక్ట్ చేయడం జరిగింది. హార్రర్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ ఈ చిత్రంలో బాగా కుదిరాయి. అలాగే సెంటిమెంట్ కూడా అందర్నీ ఆట్టుకుంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి”.
గ్యారెంటీగా మంచి హిట్ అవుతుంది!!
ఈ చిత్రంలో ఐదు పాటలున్నాయి. సాయికార్తీక్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఇలాంటి హార్రర్ చిత్రానికి రీ-రికార్డింగ్ చాలా ఇంపార్టెంట్. సాయికార్తీక్ ఎంతో కేర్ తీసుకుని ఈ సినిమా ఆర్.ఆర్. ఇరగదీసాడు. నాగేశ్వరరెడ్డి, నరేష్ కాంబినేషన్ అంటే సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం గ్యారెంటీగా మంచి హిట్ అవుతుంది. 2016 సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇయర్ ఎండింగ్‌లో ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలాగే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించి పెద్ద హిట్ చేస్తారని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను.
థ్రిల్‌ని కలిగించే ఎంటర్‌టైన్‌మెంట్!!
ఇప్పటివరకు హార్రర్ చిత్రాలు చాలా వచ్చాయి. ఈ సినిమా వాటికి భిన్నంగా వుంటుంది. భయంతో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌గారు హీరోకి ఈక్వల్‌గా వుండే పాత్రలో నటించారు. చలపతిరావు, ప్రభాస్ శ్రీను, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, ప్రగతి ముఖ్య పాత్రలు పోషించారు. పాటలన్నీ అల్టిమేట్‌గా వచ్చాయి. రెండు పాటల్ని రాజు సుందరం నృత్య దర్శకత్వంలో బ్యాంకాక్‌లో అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించాం. మరో రెండు పాటల్ని హైదరాబాద్‌లో సెట్స్ వేసి చిత్రీకరించాం. ఒకటి దినేష్ మాస్టర్, ఒకటి గణేష్ మాస్టర్‌లు కంపోజ్ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. యాక్షన్ సన్నివేశాలు హెవీగా వుండవు. రెండు, మూడు ఫైట్స్ సరదాగా వుంటాయి.
పెద్ద రేంజ్‌కి వెళ్ళే డైరెక్టర్!!
దర్శకుడు నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేసేవిధంగా రూపొందించారు. ‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’ వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత ఈ సినిమా చేస్తున్నారు. పెద్ద హీరోలతో కూడా సినిమాలు చెయ్యగలడు. ఆ క్వాలిటీస్ అన్నీ తనలో వున్నాయి. డెఫినెట్‌గా నాగేశ్వరరెడ్డి పెద్ద రేంజ్‌కి వెళ్ళే డైరెక్టర్ అవుతాడు. అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైనా కూడా సినిమాని సినిమాలాగే తీశాం. వేస్టేజ్ లేకుండా బడ్జెట్ కంట్రోల్ చేస్తూ సినిమా తీస్తే ఎలాంటి ప్రాబ్లెమ్ వుండదు. ఒక ఆడియన్‌గా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశాను. సాయి కార్తీక్ మ్యూజిక్, డైమండ్ రత్నబాబు డైలాగ్స్, దాశరధి శివేంద్ర ఫొటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి.
నిర్మాతగా పూర్తి ఇన్‌వాల్వ్‌మెంట్ వుంటుంది!!
ముప్ఫై ఏళ్లుగా కాంబినేషన్స్‌ని సెట్ చేసి వారికి తగ్గట్లుగా కథ రెడీ చేసుకుని సినిమాలు తీశాను. ఇప్పుడు అలాగే చేస్తున్నాను. నేను తీసిన అన్నీ సినిమాలకి డైరెక్టర్‌ని ఫాలో అవుతూ ఒక కో-డైరెక్టర్‌లా, ప్రొడక్షన్ కంట్రోలర్‌లా ఇన్‌వాల్వ్ అయి సినిమాని ఇష్టపడి తీస్తాను. సినిమాల మీద పిచ్చితో ఇండస్ట్రీకి వచ్చాను. ఆ పిచ్చిలో పడి కొట్టుకుపోతున్నాను. సినిమాని ఎంజాయ్ చేస్తూ పరిగెడుతున్నాను. ఇలా ఎంతకాలం వెళ్తానో చూడాలి. సినిమా తప్ప నాకు ఏ వ్యాపారం తెలీదు. ఇక్కడ నిర్మాత ఎంతకాలం వుంటాడో చెప్పలేం. అలాంటిది నేను ఇంతకాలం ఇండస్ట్రీలో వుంటూ మంచి సినిమాలు తీసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. శర్వానంద్‌తో తీస్తున్న సినిమా పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. కొంత ప్యాచ్‌వర్క్ బేలెన్స్ వుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరిలో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. 2017లో రెండు, మూడు ప్రాజెక్ట్‌లు ప్లాన్ చేస్తున్నాం. అవన్నీ ఫైనలైజ్ అయ్యాక తెలియజేస్తాను. మా అబ్బాయి బాపినీడు కొత్త డైరెక్టర్స్‌ని, కొత్త ఆర్టిస్ట్‌ల్ని పరిచయం చేస్తూ మంచి సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు” అన్నారు.