ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం..

87
- Advertisement -

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. పురపాలికల్లో వివిధ హోదాలలో ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ప్రజాప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ ఎన్జీవోల సిబ్బందితో ఈ మహిళా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

వారం రోజుల పాటు మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని….ఈ మహిళ వారోత్సవాల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు హెల్త్ క్యాంపుల నిర్వహణ, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సన్మానం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.

కంటి వెలుగు ద్వారా పురపాలక శాఖలోని మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు.మహిళా రక్షణ, మహిళ ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారికత వంటి అంశాల పైన ప్రత్యేక సమావేశాలు చర్చాగోష్టులను నిర్వహించి మరింత అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దీంతోపాటు ఈ వారోత్సవాల్లో మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసే కార్యక్రమాలను కూడా సిద్ధం చేయాలన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -