మహిళల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి..

424
Satyavathi Rathod
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ శిశు సంక్షేమాభివృద్ది శాఖ ,భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్,కేంద్ర సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి,మహిళ శిశు సంక్షేమ కార్యదర్శి దివ్య దేవరాజన్,పలువురు కార్పొరేటర్లు హాజరైయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో తమ ప్రతిభ చూపిన పలువురు మహిళలకు అవార్డుల ప్రదానం చేసి సన్మానించారు.

ఈ సందర్భంగామంత్రిసత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక రంగాల్లో సేవలందించిన మహిళలను గౌరవించుకోవలని మంచి లక్ష్యంతో సీఎం కేసీఆర్ 2014 నుండి ఈ వేడుకల్ని ఘనంగా జరిపిస్తున్నారు. ఈరోజు మహిళలు ఏ అవకాశం ఇచ్చినా నిరూపించుకుంటున్నారు. మనం మన హక్కుల కోసం కొట్లాడాలి. దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలు చూసి అడపిల్లని కడుపులోనే చంపుకోవాలని నిర్ణయించుకుంటున్నారు.

దీన్ని గమనించి ఏ రాష్టంలో లేని విధంగా మహిళల రక్షణ ,సాధికారత ,మహిళల అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఓ తండ్రిగా సీఎం కేసీఆర్ మహిళలకు అండగా నిలుస్తున్నారు. మహిళల భద్రత కోసం భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన పోలీసులు కూడ మహిళల రక్షణ కోసం చాలా బాగా పని చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మహిళలకు అండదండగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్న మన ముఖ్యమంత్రికి మనమందరం రుణపడి ఉండాలి అని అన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాలుగా మహిళలని గౌరవించుకోవలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గత ప్రభుత్వాలు మహిళల్ని పట్టించుకోలేదు మహిళల్ని ఓట్ల కోసమే వాడుకున్నారు. మా ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రతి సంక్షేమ పథకాలు మహిళల నుండి స్ఫూర్తి పొందినవి. మహిళలు నీళ్ల కోసం ఇబ్బంది పడకూడదని ఇంటిటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇప్పించడం జరుగుతుంది. ఆడపిల్లల పెండ్లికి కళ్యాణాలక్ష్మి పథకం కింద లక్ష నూట పదహార్లు ఇస్తున్నము. కేసీఆర్ కిట్లు ఇస్తున్నామన్నారు.

ప్రతి సంక్షేమ పథకాలు కూడా ఆడవాళ్ళ కష్టాలను దృష్టిలో ఉంచుకొని మా నాయకుడు కేసీఆర్ రూపొందించారు. ఆడపిల్లల చదువు కోసం 1000 గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. పేద వారికి లక్ష ఇల్లు మంజూరు చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో చాకలి ఐలమ్మ ను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమం చేసాం. తెలంగాణ లో మహిళల రక్షణ కోసం షి టీమ్స్ ఏర్పాటు చేసాం.

దేశంలో మహిళల రక్షణ కోసం షి టీమ్స్ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. మహిళల భద్రత కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో 66 శాతం సిసి కెమెరాలు మన రాష్ట్రంలో నే ఉన్నాయి.
ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. అంగన్వాడీలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు కానీ మా ప్రభుత్వం సీఎం కేసీఆర్ వారితో ఇంటికి పిలిచి బోజనమ్ పెట్టించి మంచి జీతాలు పెంచారు.
మహిళకు రక్షణకు మా ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మా మున్సిపల్ మంత్రి కేటీఆర్ కూడా మహిళల భద్రత కోసం కృషి చేస్తున్నారు అని మంత్రి పేర్కొన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నము. మన ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు ప్రతి రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. మహిళలు జిల్లా పరిషత్ చేర్మన్స్ గా మేయర్స్ గా రాణిస్తున్నారు..అవకాశం ఇస్తే మేము పని చేయగలం అని నిరూపించుకుంటున్నారు. మన ప్రభుత్వము వచ్చాక మహిళలకు ప్రాధాన్యం పెరిగింది. మనకు అడగక ముందే అన్ని ఇచ్చే ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి దొరికారు. అంగన్వాడీ టీచర్లకు అడగకుండానే వారి సమస్యల్ని చూసి మంచి జీతాలు పెంచారు. ఇంతకు ముందు చాలి చాలని పింఛన్లు ఉండే మన ప్రభుత్వం వచ్చాక మన సీఎం కేసీఆర్ 3016 పెంచారు.

ఆడపిల్లల పెండ్లి చేయాలంటే ఎన్నో కష్టాలుండేవి..ఆడవాళ్లకు ధైర్యం ఇస్తూ మన సీఎం కేసీఆర్ మేనమామ లెక్క లక్ష నూట పదహారు ఇస్తూ భరోసా కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ మదిలో నుండి పుట్టిన ఆలోచన కేసీఆర్ కిట్లు. అందరూ ఓపిక పట్టండి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తాయని మన ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు..
మహిళలకు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కల్తీ లేని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు త్వరలో ఏర్పాటు చేయనున్నారు. పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి ద్వారా రాష్ట్రం అభివృద్ది పథంలో ముందుకి వెళుతుంది. మహిళల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి తెలిపారు.

కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మన దేశంలో భారతీయ సంస్కృతిలో మహిళలకు అత్యంత గౌరవం ఇస్తాం. మహిళను ఎక్కడైనా మనం గౌరవంగా చూడాలి ,మహిళల సాధికారత కోసం అందరూ కృషి చేయాలి. తెలంగాణలో బతుకమ్మ, బోనాలు, దసరా ,ఉత్సవాల్లో మనం మహిళ దేవతల్ని పూజిస్తాం అంత గొప్ప సంస్కృతి మన తెలంగాణది. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. బార్డర్ సెక్యురిటి ఫోర్స్ లో కూడా మహిళలు ముందుకు వెళుతున్నారు. నిర్భయ సంఘటన తర్వాత చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని కోర్టు తీర్పులను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. త్వరలో ఐపిసి సీఆర్పిసి చట్టాలను మారుస్తాం. హైదరాబాద్ లో షి టీమ్స్ అద్భుతంగా పని చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఈ షి టీమ్స్ ఏర్పాటు చేస్తామని కిషన్‌ రెడ్డి అన్నారు.

- Advertisement -