ముంబై వాసులకు వడా పావ్ అనేది కేవలం ఒక తినుబండారం మాత్రమే కాదు.. అంతకుమించి. మెత్తని పావ్ మధ్యలో ఉంచే ఘాటైన బంగాళాదుంప.. బోండా కలయికతో కూడిన ఈ సాధారణ వంటకం.. ప్రయాణికులకు, విద్యార్థులకు, ఆఫీసు ఉద్యోగులకు ఆకలి తీరుస్తోంది. ఇప్పుడు ఈ వంటకం ముంబై వీధుల దాటి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.
దాదర్‌లోని కీర్తి కాలేజ్ సమీపంలో ఉన్న ‘అశోక్ వడా పావ్’…స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు ఓ దేవాలయం లాంటిది. 1966 నాటి చరిత్ర కలిగిన ఈ అవుట్‌లెట్… వడా పావ్ ఆవిర్భావానికి అసలైన మూలంగా నిలుస్తోంది. దశాబ్దాలుగా కాలేజీ విద్యార్థులు….ఆఫీసు ఉద్యోగుల నుండి మొదలుకొని సెలబ్రిటీలు, పర్యాటకుల వరకు అందరికీ ఇది రుచికరమైన సేవలను అందిస్తోంది. దీనిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లే సౌలభ్యం….తక్కువ ధర, అద్భుతమైన రుచి దీని ప్రత్యేకత.
ఇప్పుడు ఈ వడా పావ్‌కు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రపంచంలోని అత్యంత ఐకానిక్ శాండ్‌విచ్‌ల జాబితాలో 25వ స్థానాన్ని దక్కించుకుంది. టర్కీ, వియత్నాం, యునైటెడ్ స్టేట్స్ మరియు ఇటలీ వంటి దేశాల ప్రపంచ ప్రసిద్ధ శాండ్‌విచ్‌ల సరసన అశోక్ వడా పావ్ నిలిచింది.
స్థానికంగా ఎప్పటి నుంచో ప్రాచుర్యం పొంది..అంతర్జాతీయంగా ఇప్పుడిప్పుడే తగిన గుర్తింపు తెచ్చుకుంటున్న భారతీయ ప్రాంతీయ వంటకాల పెరుగుతున్న ప్రజాదరణకు ఈ వడా పావ్ ఒక ప్రతీక.
Also Read:తెలంగాణను కాపాడుకుందాం!

