జనవరి 13 నుండి 15 వరకు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్

471
srinivas goud
- Advertisement -

జనవరి 13 నుంచి 15వరకు మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బేగంపేట లోని తెలంగాణ పర్యాటక భవన్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కో – ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. కో – ఆర్డినేషన్ మీటింగ్ లో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, టూరిజం M D మనోహర్ లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల సంబందిత ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ బ్రోచర్, వాల్ పోస్టర్ ను శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, టూరిజం M D మనోహర్ లతో కలసి ఆవిష్కరించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సికింద్రాబాద్ లోని జింఖాన మైదానంలో సంక్రాంతి పండుగ ను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జనవరి 13 నుండి 15 వరకు 3 రోజుల పాటు 5వ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వివిధ ప్రభుత్వశాఖల ముఖ్య అధికారులతో ఉన్నత స్థాయి సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల ఉట్టిపడేలా అంతర్జాతీయ స్థాయి కైట్ మరియు స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నామన్నారు. దేశంలోనే అతిపెద్ద కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను హైదరాబాద్ నగరం బ్రాండింగ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 50 దేశాలకు పైగా అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కైట్ ప్లేయర్స్ ఈ ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు, దేశీయంగా 25 రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద కైట్ క్లబ్బుల ప్లేయర్ లు పాల్గొంటున్నారు. కైట్ ఫెస్టివల్ తో పాటు అనుబందంగా స్వీట్ మరియు స్నాక్స్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నామన్నారు. దాదాపుగా 25 రాష్ట్రాలనుండి వారి సంస్కృతి, కళల ప్రదర్శన ను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ . అనుబంధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయం కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -