తెల్లాపూర్‌లో గులాబీజెండా ఎగరవేయండి: హరీష్

567
harishrao
- Advertisement -

తెల్లాపూర్ మున్సిపాలిటీలో గులాబీ జెండాను ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా బిహెచ్ఈఎల్ ఎంఐజి కాలనీలో తెల్లాపూర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు హరీష్‌. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ … ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయండన్నారు. అభివృద్ధి ఏ పార్టీతో సాధ్యమో వాళ్ళకే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.తెల్లాపూర్ మున్సిపాలిటీ ని దత్తత తీసుకొని అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్ మున్సిపాలిటీ గా మారుస్తానని హామీ ఇచ్చారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కఠిన మున్సిపల్ చట్టం తీసుకువచ్చారని…కొత్త మున్సిపల్ చట్టము ద్వార వేగంగా ఇంటి నిర్మాణ అనుమతులు ఇస్తున్నామన్నారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం గెలిచిన కౌన్సిలర్లు … ప్రజ సేవకులు గా ఉండాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మారుస్తున్నామని వెల్లడించారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిలుస్తున్నాయని…కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు.

తెల్లాపూర్‌ను మున్సిపాలిటీ గా చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వందేనన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. గత ప్రభుత్వాలు శిలాఫలకలు వేయడం తప్ప అభివృద్ధి చేయలేదని..తెల్లాపూర్ ప్రాంతంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. తెల్లపూర్ లో ఎంఎంటీఎస్ రైలు స్టేషన్ ను ఏర్పాటు చేసి , రైలు సర్వీసులు పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెల్లాపూర్, వెలిమల ప్రాంతాల్లో అండర్ పాస్ బ్రిడ్జి ను నిర్మిస్తామని..రేడియల్ రింగు ను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.

ఆదిత్య మూజిక్ తొలిసారి నిర్మాణరంగంలో అడుగుపెట్టగా కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జనవరి 15న సినిమా విడుదల కానుండగా గోపిసుందర్ సంగీతం అందించారు.

- Advertisement -