జనవరి 12 సెంటిమెంట్ ను ఫాలోఅవుతున్న బన్ని

386
Hero Allu arjun
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన దేశముదురు సినిమా 12ఏళ్ల క్రితం జనవరి 12 విడుదల అయింది. ఈమూవీ బన్నీని మరో లెవల్ కు తీసుకెళ్లిందని చెప్పుకోవాలి. అప్పటి వరకు క్లాస్ సినిమాల్లో నటించిన బన్నీ దేశముదురు సినిమాతో మాస్ యాంగిల్ లోఅభిమానులను అలరించాడు. ఇక మరోసారి అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు బన్ని. అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల..వైకుంఠపురంలో చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ సినిమా రానుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా చూసిన బన్నీ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

అల..వైకుంఠపురం సినిమాతో భారీ విజయాన్ని సాధించబోతున్నట్లు బన్నీ తన సిన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని తెలుస్తుంది. తమన్ సంగీతం అందించిన ఈసినిమా పాటలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్ టబు, రాజేంద్రప్రసాద్, నవదీప్, సుశాంత్, నివేధా పేతురాజ్, తనికెళ్ల భరణి కీలకపాత్రల్లో నటించారు.

- Advertisement -