మంత్రి కేటీఆర్‌కు మ‌రో అరుదైన గౌర‌వం..

54
- Advertisement -

తెలంగాణలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమర్థత గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు..యావత్ ప్రపంచానికి ఆయన ఏంటో ఇప్పటికే అర్థమైపోయింది. ..ఏడేళ్లలోనే తెలంగాణను ప్రపంచ ఐటీ, పారిశ్రామిక కేంద్రంగా మార్చిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుంది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పారదర్శక ఐటీ, ఇండస్ట్రియల్ పాలసీతో పాటు, మంత్రి కేటీఆర్ దేశ, విదేశాలు తిరిగి, ప్రపంచ ఐటీ దిగ్గజాలను అయ్యేలా చేసారు. మారుతున్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ వివిధ రంగాలపై అపారమైన నాలెడ్జ్, ఇంగ్లీష్ భాషలో మంచి పట్టు, అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, కొత్తదనాన్ని ఆవిష్కరించడంలో కేటీఆర్ చూపే చొరవకు టిమ్ కుక్, సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటి ఐటీ దిగ్గజాలు సైతం ఫిదా అయ్యారు. గతంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు ఇండియా నుంచి మంత్రి కేటీఆర్‌ను తమ సమావేశాల్లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించి గౌరవించిన సంగతి తెలిసిందే.

తాజాగా తెలంగాణ రాష్ట్ర, ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌కు మ‌రొక అరుదైన గౌర‌వం ల‌భించింది. అమెరికాలోని ప్ర‌ఖ్యాత హార్వర్డ్ యూనివ‌ర్సిటీ ప్ర‌త్యేక ఆహ్వానం వ‌చ్చింది. ఇండియా కాన్ఫ‌రెన్స్ ఎట్ హార్వ‌ర్డ్ స‌ద‌స్సులో పాల్గొనాల్సిందిగా మంత్రి కేటీఆర్‌‌కు ఆహ్వానం వచ్చింది.. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి తీసుకున్న చ‌ర్య‌లు, ట‌ర్బో ఛార్జింగ్ ఇండియా అనే అంశాల‌పై మాట్లాడాల‌ని హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ స‌ద‌స్సులో ఆయ‌న ప్రాతినిథ్యం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్టుగా నిర్వాహ‌కులు తెలప‌గా.. మంత్రి కేటీఆర్ సైతం అదే ఉత్సాహాన్ని, సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఈనెల 20వ తేదీన సాయంత్రం 6.30కు మంత్రి కేటీఆర్ ఇండియా @2030 – ట్రాన్స్ఫర్మేషనల్ డికేడ్ అనే అంశం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్ర‌సంగిస్తారు.

మంత్రి కేటీఆర్‌కు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అవకాశం రావడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. కాగా మరోవైపు మంత్రి కేటీఆర్‌ అసమర్థుడు అంటూ పనికిమాలిన విమర్శలు చేస్తే చదువురాని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను, అతి తెలివిగా గాడిద భాషలో నోటికి వచ్చినట్లు బూతులు తిట్టే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని నెట్‌జన్లు ఏకిపారేస్తున్నరు. బండి, రేవంత్‌ రెడ్డిలు తలకిందులుగా తపస్సు చేసినా కేటీఆర్ స్థాయికి అందుకోలేరు..ఆయన కాలిగోటికి కూడా సరిపోరంటూ నెట్‌జన్లు ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్‌కు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అరుదైన గౌరవం దక్కడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది.

- Advertisement -