మంత్రి కేటీఆర్‌కు మరో ఆహ్వానం..

49
- Advertisement -

జర్మనీలోని బెర్లిన్‌లో ఏషియా బెర్లిన్‌ సమ్మిట్‌-2023 సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకి హాజరుకావాలని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు నిర్వాహకులు. జూన్‌ 12 నుంచి 15 వరకు కనెక్టింగ్‌ స్టార్టప్‌ ఎకోసిస్టం అనే అంశంపైన నిర్వహించే ఈ సదస్సులో ప్రసంగించాలని కోరారు.

జర్మనీ, ఆసియా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను, భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు ఏటా ఈ సదస్సును నిర్వహిస్తారు.ఈ సదస్సులో ప్రసంగించడం ద్వారా వివిధ దేశాల మధ్య బలమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ప్రయత్నాలను బలోపేతం చేయాలని కోరారు. జర్మనీలోని స్టార్టప్‌ ఎకో సిస్టం బలాన్ని ఆసియాలోని స్టార్టప్స్‌తో పంచుకొనేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని ఆహ్వానంలో పేరొన్నారు.

Also Read:తలసేమియా డే:ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?

ముఖ్యంగా జర్మనీలో ఉన్న స్టార్టప్స్‌ను ఆసియా ఖండంలోని మారెట్లతో అనుసంధానం చేసేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం జరగనున్న సదస్సు మొబిలిటీ, లాజిస్టిక్స్‌, ఎనర్జీ, గ్రీన్‌టెక్‌, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి ప్రధాన అంశాలను విస్తృతంగా చర్చిస్తుందని పేర్కొన్నారు.

Also Read:Chalapathi Rao:ఇండస్ట్రీలో చెరగని ముద్ర

- Advertisement -